Major setback for Congress leaders in Delhi HC ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేతలకు చుక్కెదురు..

Delhi hc says charges against smriti irani and her daughter are slanderous

Union Minister Smriti Irani, Smriti Irani daughter, Zoish Irani, Bar and Restaurant, Goa, Bar license, congress lawmakers, defamation suit, Delhi High Court, Jairam Ramesh, Pawan Khera, Netta D'Souza, Congress, BJP, National Politics

The Delhi High Court found that the accusations made against Union Cabinet Minister Smriti Irani and her daughter are false and without merit, which is a significant defeat for the Congress. The Delhi High Court ruled today that a Goa bar that has been the subject of controversy is not owned by either Union Minister Smriti Irani or her daughter Zoish (or the restaurant).

‘‘అపవాదు అంటగట్టేందుకే..’’: ఢిల్లీ హైకోర్టు.. కాంగ్రెస్ నేతలకు చుక్కెదురు..

Posted: 08/02/2022 11:10 AM IST
Delhi hc says charges against smriti irani and her daughter are slanderous

కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా అమె కుమార్తె జోయిష్ ఇరానీపై వారు చేసిన అరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్ని అమెకు అపవాదును అంటగట్టేందుకేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జోయిష్ ఇరానీ గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. అయితే, గోవాలో స్మృతి ఇరానీ పేరు మీద కానీ, ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ పేరు మీద కానీ ఎలాంటి బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నట్టు రికార్డుల్లో లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

గోవాలో జోయిష్ ఇరానీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు అనేందుకు కానీ, బార్ యాజమానులు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. జోయిష్ ఇరానీ ఫుడ్ అండ్ బేవరేజెస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న దాఖలాలు కూడా లేవని వెల్లడించింది. అంతేకాదు, స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా తదితరులు తప్పుడు ఆరోపణలతో కుట్రపూరితంగా వ్యక్తిగత దాడులు చేసినట్టు అర్థమవుతోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతల ప్రకటన కూడా ఏదో అపవాదు మోపుతున్నట్టుగానే కనిపిస్తోందని పేర్కొంది.

ఈ నేతలు హానికరమైన ఉద్దేశాలతోనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం కలుగుతోందని ఢిల్లీ హైకోర్టు వివరించింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పరువుప్రతిష్ఠలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఈ ఆరోపణలు చేశారని భావిస్తున్నామని వెల్లడించింది. ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువునష్టం దావాపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. కాగా, స్మృతి ఇరానీ పరువునష్టం దావా నేపథ్యంలో న్యాయస్థానం జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలకు సమన్లు పంపింది. ట్విట్టర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles