HC denies bail to three accused in Viveka murder case వైఎస్ వివేకా హత్యకేసు నిందితులకు బెయిల్ నిరాకరణ

Ys viveka murder case andhra pradesh high court dismisses bail plea accused

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Narreddy Rajasekhar Reddy, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Y.S. Avinash Reddy, YCP state secretary, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, TDP MLC BTech Ravi, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The Andhra Pradesh high court dismissed the bail petitions filed by the accused in Y S Vivekananda Reddy murder case. The high court observed that there were no fresh grounds for granting of bail. The accused in the case Y Sunil Yadav (A2), G Uma Shankar Reddy (A3) and D Siva Shankar Reddy moved the high court for the second time seeking bail. As the main accused T Gangi Reddy (A1) is already on bail and the CBI had filed charge sheet in the case.

వైఎస్ వివేకా హత్యకేసు: నిందితులకు బెయిల్ నిరాకరించిన ఏపీ హైకోర్టు

Posted: 08/01/2022 07:54 PM IST
Ys viveka murder case andhra pradesh high court dismisses bail plea accused

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులోని నిందితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది. ఏ1 గంగిరెడ్డికి బెయిలు మంజూరు కావడంతో ఆయన బెయిలుపై బయటకు వెళ్లిడంతో తమకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈకేసులో నిందితులైన ఏ2, ఏ3, ఏ5 ముగ్గురు కింది కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అక్కడ కోర్టు వారి పిటీషన్లను తిరస్కరించింది. దీంతో రాష్ట్రోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. ఏ2 వై సునీల్ యాదవ్, ఏ3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు రాష్ట్రోన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం బెయిల్ పిటీషన్లను కొట్టివేసింది. దర్యాప్తు కొనసాగుతోందని, గతంలో వేసిన బెయిలు పిటిషన్లను కొట్టేశాక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని పేర్కొంది. దిగువ కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేయడాన్ని పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకున్నట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బెయిలు పిటిషన్లను కొట్టేస్తూ సోమవారం కీలక తీర్పు ఇచ్చారు. ముగ్గురు నిందితుల బెయిల్ పిటీషన్లపై వాదనలు ముగియడంతో సోమవారం వారి బెయిల్ పిటీషన్లపై తీర్పును న్యాయస్థానం వెలువరించింది.

వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ హత్యకేసులో సాక్ష్యాలను మాయం చేశారని.. సాక్ష్యులను కూడా బెదిరించారని వాదనలు వినిపించారు. వివేకా గాయాలను కాంపౌండరుతో కుట్టించి.. ఆయన గుండెపోటుతో మరణించారని కూడా ప్రచారం చేశారని అన్నారు. పోస్టుమార్టం జరగకుండా తీవ్రజాప్యం చేశారని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. గతంతో తాత్కాలిక బెయిలుపై వచ్చినప్పుడే ఆయన సాక్షులను ప్రభావితం చేసేలా భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారని వాదించారు. రాజకీయ నేతలు ఆయన్ను కలిశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ముగ్గురు మిత్రులు. శివశంకర్‌రెడ్డిపై మొత్తం 31 కేసులున్నాయని తెలిపారు

సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. వివేకా మృతదేహంపై గాయాలను ఫొటో తీస్తున్న హోంగార్డును శివశంకర్ రెడ్డి బెదిరించారని వాదించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా సీఐ శంకరయ్యపై ఒత్తిడి తెచ్చారన్నారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నారు. సాక్షులను, అధికారులను బెదిరిస్తున్నారని.. హత్యానేరాన్ని మీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని గంగాధర్‌రెడ్డికి ఆశ చూపారన్నారు. కుట్రకోణం తేల్చేందుకు, సాక్ష్యాధారాలను నాశనం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దని కోరారు. సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, కలిగినీడి చిదంబరం, టీఎల్‌ నయన్‌కుమార్‌ వాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles