LPU graduate gets 3 Crore package భారత ఇంజనీరింగ్ విద్యార్థికి రూ.3 కోట్ల వేతనంతో కళ్లు చెదిరే ప్యాకేజీ

Lovely professional university graduate gets 3 crore package

lovely professional university LPU, yasir got 3crore package, Lovely professional university B.Tech cse student Yasir, B.Tech CSE student broke placement record, Yasir, Kerala, Multinational company, Job offer, German company, Indian Engineering Graduate

By getting a grand placement package of INR 3Crore, LPU class of 2018 passout Yasir M. has created a new placement record. Hailing from Kerala, Yasir, a B.Tech. CSE graduate from Lovely Professional University will be working for a world-renowned multinational company, which has contributed significantly to the world during the pandemic, at a whopping package of Rs. 3 crores.

ఎల్పీయూ ఇంజనీరింగ్ పట్టభద్రుడికి రూ.3 కోట్ల వేతనంతో కళ్లు చెదిరే ప్యాకేజీ

Posted: 07/30/2022 04:41 PM IST
Lovely professional university graduate gets 3 crore package

భారతీయ విద్యార్థులు తమ సత్తాను ఎప్పటికప్పుడు చాటుతూ అనేకమంది ఔత్సాహికులకు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న పలు అంతర్జాతీయ సంస్థల్లో భారీ వేతనంతో ఉన్నత హోదా ఉద్యోగాలను సోంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ భారతీయులు పలు బహుళజాతి సంస్థలకు అత్యున్నత స్థాయిలో కొనసాగుతూ ఆయా సంస్థలను ముందుకు నడుపుతున్నారు. ఈ క్రమంలో, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ విద్యార్థి కళ్లు చెదిరే వేతనంతో భారీ ప్యాకేజీ సొంతం చేసుకున్నాడు.

ఆ విద్యార్థి పేరు యాసిర్. 2018లో అతడు ఎల్పీయూలో సీఎస్ఈ విభాగంలో బీటెక్ పూర్తిచేశాడు. దీంతో అతను ఎటువైపు పయనించాలన్న అలోచనలో పడ్డాడు. అయితే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేయకుండా ఉద్యోగంలో చేరాలని చివరకు నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన చేసిన ప్రయత్నాలకు కరోనా మహమ్మారి రెండేళ్లు పాటు అడ్డకుకుంది. ఆ తర్వాత అతని ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బంపర్ బొనాంజా దక్కించుకున్నాడు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా విశిష్ట సేవలు అందించిన ఓ బహుళజాతి కంపెనీలో రూ.3 కోట్ల వార్షిక వేతనంతో జర్మనీలో ఉద్యోగం పొందాడు.

ఎల్పీయూ క్యాంపస్ లో పటిష్ఠమైన విద్యావిధానం ద్వారానే తాను మెరుగైన ఉద్యోగం పొందగలిగానని యాసిర్ చెబుతున్నాడు. యాసిర్ కేరళకు చెందినవాడు. 8.6 సీజీపీఏ స్కోరుతో అతడు బీటెక్ పూర్తిచేశాడు. యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో అనేక సాంకేతిక సదస్సుల్లో తన ప్రతిభ చాటాడు. యాసిర్ ఒక్కడే కాదు, ఎల్పీయూలో చదివిన పలువురు గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, మెర్సిడెస్ వంటి ఫార్చూన్-500 కంపెనీల్లో కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇటీవలే హరేకృష్ణ మాతో అనే బీటెక్ విద్యార్థి గూగుల్ బెంగళూరు క్యాంపస్ లో రూ.64 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles