Bhagat Singh Koshyari's remark sparks Gujarati-Marathi row మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలు వివాదాస్పదం.. శివసేన మండిపాటు

Big row over maharashtra governor s remarks uddhav thackeray supriya sule say he should be

Bhagat singh Koshyari, Gujaratis, Rajasthanis, Mumbai, Economic capital, Uddhav thackarey, Sanjay Raut, Eknath Shinde, Sachin sawanth, Priyanka chathurvedi, Devendra Fadnavis, Shiv Sena, Maharashtra, Politics

Hitting out at Maharashtra Governor Bhagat Singh Koshyari over his remarks on Mumbai, NCP MP Supriya Sule urged President Droupadi Murmu to remove him from his post. Accusing Bhagat Singh Koshyari of creating “acrimony and division” among the people, Sule called him a “regular offender”. “It's Governor's responsibility to treat everybody equally. Governor is creating acrimony & division among the people.

మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలు వివాదాస్పదం.. శివసేన మండిపాటు

Posted: 07/30/2022 05:49 PM IST
Big row over maharashtra governor s remarks uddhav thackeray supriya sule say he should be

గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించి వేస్తే ముంబైలో డబ్బు మిగలదని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో అగ్గిరాజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా శివసేన పార్టీ నేతలు గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల వాళ్లు వెళ్లిపోతే ముంబై ఆర్థిక రాజధాని హోదాను కోల్పోతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. మరాఠీ ప్రజలు, మరాఠా గౌరవాన్ని కించపరిచేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. హిందువుల మధ్య చిచ్చుపెట్టేలా కోష్యారీ మాట్లాడారని అన్నారు.

గవర్నర్ ను ఇంటికి పంపుతారా? జైలుకు పంపుతారా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోష్యారీ వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న సమయంలో, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో దేవాలయాలను గవర్నర్ హడావుడిగా తెరిపించారని థాకరే విమర్శించారు. గతంలో ఆయన సావిత్రిబాయ్ పూలేను అవమానించారని, ఇప్పుడు మరాఠీ బిడ్డలను అగౌరవపరిచారని మండిపడ్డారు. ముంబైలోని అంధేరీలో ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘గుజరాతీలు మరియు రాజస్థానీలను మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై, థానే నుంచి బయటకు పంపిస్తే ఇక్కడ పైసా మిగలదని నేను ప్రజలకు చెబుతూ ఉంటాను. అదే జరిగితే భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై ఇకపై అలా ఉండబోదంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కామెంట్లు కష్టపడి పని చేసే మరాఠీ ప్రజలను అవమానించేవిగా ఉన్నాయన్నారు. బీజేపీ మద్దతుతో సీఎం అయిన ఏక్ నాథ్ షిండేకు కూడా ఇది అవమానం అన్నారు. మహారాష్ట్ర, మరాఠీ ప్రజలు బిచ్చగాళ్లని భావించేలా గవర్నర్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీఎం షిండేకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా.. గవర్నర్‌తో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగం వీడియోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఒక రాష్ట్ర గవర్నర్ అదే రాష్ట్ర ప్రజల పరువు తీయడం దారుణమైన విషయం అన్నారు. ఏ రాష్ట్రప్రజలకు ఆయన సేవ చేయాలని వచ్చారో వారినే అవమానించే రీతిలో ఆయన మరోమారు వ్యవహరించారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. తక్షణం గవర్నర్ తన వ్యాఖ్యలనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రజల శ్రమను అవమానించినందుకు గవర్నర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.

దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహోరాత్రులు శ్రమించిన మహారాష్ట్ర ప్రజలు, మరాఠీలకు ఇది అవమానం. గవర్నర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేదా ఆయనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తాం. సీఎం, డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర క్యాబినెట్ కు ఇది ఓకేనా? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ఆమె ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని గవర్నర్‌ కొష్యారి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర అభివృద్ధిలో రాజస్థాన్, గుజరాత్ ప్రజల సహకారం గురించి చెప్పేందుకే అలా మాట్లాడానని తెలిపారు. మహారాష్ట్రను ఈ స్థాయిలో నిలపడానికి మరాఠీలు ఎంతో కష్టపడ్డారన్నారు. వాళ్లను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles