Monkeypox: UK health officials identify new symptoms ‘‘అక్కడ చిన్నగాయం కూడా మంకీపాక్స్ కు సంకేతం కావచ్చు’’

Monkeypox epidemic and pandemic preparedness as a matter of policy

one or two genital lesions, anal lesions, lesions in mouth, signs of monkeypox, monkeypox new symptoms, new sexual partner, UK Health Security Agency, monkeypox, UK, Symptoms, UK Health Agency, Epidermic, Pandemic, polio outbreak, monkeypox outbreak, epidemic preparedness, reemerging diseases

Health officials in the UK have updated the case definition of monkeypox to include new symptoms associated with the disease. A single lesion or lesions on the genitals, anus and surrounding area, lesions in the mouth, and anal pain or bleeding, especially if the individual has had a new sexual partner recently, have all been identified

ఆ ప్రదేశాల్లో చిన్న గాయం కూడా మంకీ పాక్స్ కి సంకేతం కావచ్చు: యూకే హెల్త్ ఏజెన్సీ

Posted: 07/27/2022 08:22 PM IST
Monkeypox epidemic and pandemic preparedness as a matter of policy

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించి ఇప్పుడిప్పుడే కాసింత ఉపశమనం పొందుతున్న తరుణంలో.. మరో మహమ్మారి ప్రపంచ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. అదే మంకీ ఫాక్స్. ఇప్పటికే యూనైటెడ్ కింగ్ డమ్ లో విజృంభిస్తున్న ఈ మహమ్మారికి చెందిన లక్షణాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ముఖాముఖితో కూడా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే తెలిపిన యూకె వైద్యనిపుణులు.. మహమ్మారి వ్యాప్తి చెందడానికి కూడా గల కారణాలను పేర్కోన్నారు. కాగా తాజాగా మరిన్నీ సంకేతాలను ఈ జాబితాలో చేర్చారు.

శరీరంలోని చిన్న గాయం కూడా మంకీపాక్స్ వైరస్ కు సంకేతం కావొచ్చని హెచ్చరించారు. అది కూడా ఓ వ్యక్తి కొత్తగా ఎవరితో అయినా శృంగారంలో పాల్గొన్న తర్వాత చిన్న గాయం కనిపిస్తే మంకీపాక్స్ గా అనుమానించాల్సి ఉంటుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే 75 దేశాలకు వ్యాపించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఆరోగ్య స్థితిగా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ వైరస్ కేసులకు సంబంధించి యూకే హెల్త్ ఏజెన్సీ నిర్వచనాన్ని అప్ డేట్ చేసింది.

దీనివల్ల వ్యక్తులు, వైద్య నిపుణులు వైరస్ ను గుర్తించడం సులభంగా ఉంటుందని పేర్కొంది. వ్యాధి లక్షణాల జాబితాను పెంచింది. ఇందులో జననాంగాలు, మల విసర్జన ద్వారం, దాని చుట్టుపక్కల, ముఖం, పెదవులపై చిన్న గాయం కనిపించినా అది మంకీపాక్స్ వైరస్ కావొచ్చని పేర్కొంది. సన్నిహితంగా మెలగడం, శృంగారంలో పాల్గొనడం ద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రాథమిక పరీక్షల ఆధారంగా తెలుస్తున్నట్టు యూకే హెల్త్ ఏజెన్సీ తెలిపింది. అధిక జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, లింఫ్ నోడ్స్ వాపు ఇన్ఫెక్షన్ కు సంకేతాలుగా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles