Largest pink diamond in 300 years discovered in Angola అంగోలాలో అతిపెద్ద పింక్ డైమండ్.. ధర ఎంతో తెలుసా.?

Rare pink diamond may be the largest one found in 300 years

Angola, pink diamond, rare pink diamond, largest diamond, diamond found in Angola, Lulo Rose, 170-carat stone, Lulo alluvial mine, Australian miner, Lucapa Diamond, international tender, diamond trading firm Sodiam, Angola news

A rare pink diamond found in Angola may be the largest recovered in the last three centuries, according to Australian miner Lucapa Diamond. The 170-carat stone from the Lulo alluvial mine has been named the “Lulo Rose,” the company and its partners, Endiama EP and Rosas & Petalas, said in an exchange filing

అంగోలాలో అతి పెద్ద పింక్ డైమండ్ ల‌భ్యం.. 300 ఏళ్ల‌లో ఇలాంటిది చూడ‌లేదు

Posted: 07/27/2022 07:24 PM IST
Rare pink diamond may be the largest one found in 300 years

ఆంగోలా గ‌నుల్లో అతిపెద్ద పింక్ డైమండ్ ల‌భ్య‌మైంది. గ‌డిచిన 300 ఏళ్ల‌లో ఇలాంటి వ‌జ్రాన్ని చూడ‌లేద‌ని ఆ సైట్ ఆప‌రేట‌ర్‌ ప్ర‌క‌టించారు. లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వ‌జ్రం.. లూలో మైన్‌లో దొరికింది. అది 170 క్యారెట్ పింక్ డైమెండ్ అని అస్ట్రేలియాకు చెందిన మైనింగ్ కంపెనీ లుకాపా డైమెండ్ తెలిపింది. అతి స‌హ‌జ‌మైన రీతిలో దొరికిన అతి అరుదైన వజ్రాన్ని ఆంగోలా ప్ర‌భుత్వం ఆహ్వానించిన‌ట్లు ఆప‌రేట‌ర్ చెప్పారు. లూలో మైన్ నుంచి పింక్ వ‌జ్రం ల‌భించ‌డం ఇది రెండ‌వ‌సారి అని ఆంగోలా గ‌నుల‌శాఖ మంత్రి డ‌మాంటినో అజివేడో తెలిపారు.

దీనిని అంగోలన్ రాష్ట్ర డైమండ్ ట్రేడింగ్ కంపెనీ పోడియం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో వేలానికి పెట్టనున్నారు. ఫాన్సీ రంగులతో ఉన్న వజ్రాలు.. రంగురహిత వజ్రాల కన్నా అధిక ధరలకు ఇప్పటివరకు అమ్ముడు పోయాయని దీంతో ఈ వజ్రం ధర కూడా ఏకంగా 900 కోట్లకు పైగానే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అయితే లూలో రోజ్ వ‌జ్రాన్ని క‌టింగ్‌, పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. దాని వ‌ల్ల ఆ వ‌జ్రం బ‌రువు 50 శాతం త‌గ్గిపోతుంది. గ‌తంలో 59.6 క్యారెట్ల పింక్ స్టార్ వ‌జ్రాన్ని హాంగ్‌కాంగ్ వేలంలో సుమారు 71.2 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్మేశారు. కొత్త‌గా దొరికిన పింక్ డైమండ్ అంత‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయే అవ‌కాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles