India declares day of state mourning for Shinzo Abe షింజో అబే మృతికి భారత్ నివాళి.. ‘జాతీయ సంతాప దినం’ ప్రకటన

Shinzo abe was trusted friend of india will be remembered for years pm modi

state mourning for Shinzo Abe, Shinzo Abe, Shinzo Abe death, Shinzo Abe dies, Shinzo Abe passes away, shinzo abe shot, shinzo abe shot video, shinzo abe condition, shinzo abe japan, japan pm, shinzo abe latest news, Japan former PM shot, Japan, assassination, former japan pm shinzo abe, shinzo abe india relations, shinzo abe narendra modi, shinzo abe manmohan singh, shinzo abe updates, japan shinzo abe, pm shinzo abe, japan pm shinzo abe, japan prime minister, shinzo abe twitter, shinzo abe video, prime minister of japan, shinzo abe twitter account, attack on shinzo abe, shinzo abe wife, shinzo abe attack, japan news

India on Friday announced one day of state mourning over the death of former Japanese prime minister Shinzo Abe, with Prime Minister Narendra Modi hailing him as a global statesman who made an immense contribution to elevating bilateral ties. Shinzo Abe, 67, died in hospital almost five-and-a-half hours after he was shot while making an election campaign speech in Nara city.

షింజో అబే మృతికి భారత్ నివాళి.. ‘జాతీయ సంతాప దినం’ ప్రకటన

Posted: 07/08/2022 05:52 PM IST
Shinzo abe was trusted friend of india will be remembered for years pm modi

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. షింజో అబేతో తనకు ఉన్న స్నేహం గురించి ప్రధాని మోదీ ట్వీట్స్ చేశారు. ఇటీవల టోక్యో వెళ్లిన సమయంలో తన స్నేహితుడు షింజో అబేను కలుసుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

జపాన్- ఇండియా సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారని.. జపాన్- ఇండియా అసోసియేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడేందుకు సహకారం అందించారని ప్రధాని మోదీ గుర్తు చేస్తున్నారు. భారతదేశం ఈ కష్ట సమయంలో జపాన్ సోదర సోదరీమణులకు సంఘీభావంగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. షింజో అబే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచే తనకు షింజో అబేతో అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రధాని అయిన తర్వాత మా స్నేహం కొనసాగిందని..ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయన అవగాహన చాలా లోలైనదని అన్నారు.

షింజో అబే రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత నొబుసుకే కిషి, చినతాత ఇసాకు సాటో ఇద్దరూ దేశ ప్రధానులే. పదేళ్లపాటు దేశాన్ని ఏలారు. తండ్రి విదేశాంగ మంత్రిగా చేశారు. షింజో తాతల అడుగు జాడల్లో జాతీయవాదిగా ఎదిగారు. జపాన్‌ను సైనిక శక్తిగా చూడాలనుకున్నారు. ఈ క్రమంలో జపాన్‌లోని ఉదారవాదులకు, రెండో ప్రపంచ యుద్ధకాలంలో అణచివేతకు గురైన చైనా, కొరియా లాంటి పొరుగు దేశాలకు కంటగింపుగా మారారు. 2006లో 52 ఏళ్ల పిన్న వయస్సులో తొలిసారి ప్రధాని అయినపుడు భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు.

అయితే, పేగు క్యాన్సర్‌ రావడంతో ఏడాదిలోనే దిగిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వంలో అవినీతి కారణంగా ఐదేళ్లలో ఆరుగురు ప్రధానులు మారారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ 2012లో షింజో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 2020 వరకు ఎదురులేకుండా పాలించారు. దేశ రాజకీయాల్లో స్థిరత్వం తెచ్చారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందున్న జపాన్‌ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని కంకణం కట్టుకున్నారు. ఆయన రాజ్యాంగాన్ని ఎందుకు పునరుద్దరించాలని భావించారన్న వివరాల్లోకి వెళ్తే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధిపత్యం కొనసాగించింది.

ఈ క్రమంలో జపాన్‌ మెడలు వంచి కొత్త రాజ్యాంగం రాయించిన అమెరికా జపాన్‌కు సైన్యం లేకుండా చేసింది. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. షింజో ప్రధాని అయ్యాక సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ను పూర్తి స్థాయి సైన్యంగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికా రాయించిన రాజ్యాంగాన్ని షింజో తాత కూడా ప్రధాని హోదాలో వ్యతిరేకించారు. అయితే, ఆయన ఎక్కువ కాలం అధికారంలో నిలబడలేక పోయారు. ఆయన కలను నెరవేర్చేలోగా మనుమడు షింజో హత్యకు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles