Former Japanese Prime Minister Shinzo Abe died జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత.. ఆగంతకుడి కాల్పుల్లో గాయపడి..

Shinzo abe dies succumbs to shot by gunman during election campaign

Shinzo Abe, Shinzo Abe death, Shinzo Abe dies, Shinzo Abe passes away, shinzo abe shot, shinzo abe shot video, shinzo abe condition, shinzo abe japan, japan pm, shinzo abe latest news, Japan former PM shot, Japan, assassination, former japan pm shinzo abe, shinzo abe india relations, shinzo abe narendra modi, shinzo abe manmohan singh, shinzo abe updates, japan shinzo abe, pm shinzo abe, japan pm shinzo abe, japan prime minister, shinzo abe twitter, shinzo abe video, prime minister of japan, shinzo abe twitter account, attack on shinzo abe, shinzo abe wife, shinzo abe attack, japan news

Japan is in shock following the assassination of one of the country's most powerful politicians, former Prime Minister Shinzo Abe. As Japan's longest serving prime minister, Abe has had a lasting impact on Japanese politics, including since he stepped down in 2020. And the attack is especially shocking in a place with such little gun violence.

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత.. ఆగంతకుడి కాల్పుల్లో గాయపడి..

Posted: 07/08/2022 04:28 PM IST
Shinzo abe dies succumbs to shot by gunman during election campaign

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) ఆసుపత్రిలో చికిత్స పోందుతూ కన్నుమూశారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిని ఆయన మృత్యువుతో పోరాడి ఓడిపోయారని జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. షింజో అబే(67) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన షింజో ఓ మాజీ సైనికుడి తూటాలకు బలయ్యారు. దక్షిణ జపాన్‌లోని నారా నగరంలో రైల్వే స్టేషన్‌ వెలుపల ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది.

వెనుక నుంచి వచ్చిన మాజీ సైనికుడు నాటు తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పిడికిలి పైకెత్తి మాట్లాడుతున్న షింజో అబే మెడలో ఒక తూటా, గుండెలో మరో తూటా వెంట వెంటనే దూసుకుపోయాయి. వెంటనే ఆయన ఛాతి పట్టుకొని కుప్పకూలిపోయారు. తెల్లటి చొక్కా ఎర్రటి రక్తంతో తడిసిపోవడంతో ఆయనపై కాల్పులు జరిగిన విషయం చుట్టుపక్కల వారికి అర్థమైంది. అప్పటికప్పుడు హెలికాప్టర్‌పై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే షింజో తుది శ్వాస విడించారు. షింజో మరణం ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతికి గురిచేసింది.

రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలగినప్పటికీ ఇప్పటికీ జపాన్‌ రాజకీయాలను శాసించే అత్యున్నత నేతగా వెలుగొందుతున్నారు. జపాన్‌ చరిత్రలో అత్యధిక కాలం (9 ఏళ్లు) ప్రధానిగా కొనసాగిన ఘనత కూడా ఆయనదే. కాగా, కాల్పులు జరిపిన మాజీ సైనికుడి తెట్సుయా యమగామి(41). నారా పట్టణానికి చెందిన వాడే. జపాన్‌ నావికా దళంలో 2002 నుంచి 2005 వరకు మూడేళ్ల పాటు పని చేశాడు. అతడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద డబుల్‌ బ్యారెల్‌ షాట్‌ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

త్రీడీ ప్రింటింగ్‌ పద్ధతిలో హంతకుడే స్వయంగా గన్‌ను తయారు చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. హంతకుడు షింజో వెనుక నిలబడి కేవలం పది అడుగుల దూరం నుంచి కాల్పులు జరిపాడు. రెండో బుల్లెట్‌ గుండెకు తగలగానే షింజో పడిపోయారు. హంతకుడు పారిపోయేందుకు ప్రయత్నం చేయలేదు. చంపడానికే కాల్చానని చెప్పాడు. హంతకుడి ఉద్దేశమేంటో, ఎందుకు చంపాడో ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. షింజో పట్ల అసంతృప్తి ఉందని మాత్రమే చెప్పాడు. అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలు లభించాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles