Twitter User Asks Anand Mahindra "Are You An NRI?" ‘‘సార్ మీరు ఎన్నారై’యేనా.?’’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇది.!

Are you an nri internet is infinitely charmed by anand mahindra reply

mahindra, nri, rpg group, harsh goenka, july skyline, anand mahindra, industrialist, motherland, social media, twitter, Anand Mahindra tweet, Agnipath scheme, Agnipath News, Agnipath protests, agnipath protests news, Agnipath Scheme, Agnipath protests, agnipath, Supreme Court, SC, plea, uttar pradesh, supreme court, plea, indian army, caveat, agnipath scheme, agnipath, Indian army, army recruitment, National, Politics, viral post

No matter where you go there will always be a special place in your heart for your motherland. Industrialist Anand Mahindra, who is known for his insightful and motivational tweets, was recently asked if he was an NRI. And, his response has won the internet.

‘‘సార్ మీరు ‘ఎన్నారై’యేనా.?’..’ చమత్కారంగా బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.!

Posted: 07/06/2022 06:36 PM IST
Are you an nri internet is infinitely charmed by anand mahindra reply

దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్  ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్‌ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి ఇస్తారు. కొన్నిసార్లు ట్విట్టర్ యూజర్ల విచిత్రమైన ప్రశ్నలకు ఆనంద్‌ మహీంద్రా చమత్కారంగా జవాబు ఇస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు నెటిజనులు మాత్రం ఏ ప్రశ్నను ఆయనను అడగాలి.? ఏ ప్రశ్నను అడగరాదు అన్న విషయం కూడా తెలియకుండానే ప్రశ్నలు సంధిస్తుంటారు. అయినా ఆయన తనకు ఎదురైయ్యే ప్రశ్నలను ఈజీగానే తీసుకుని చమత్కారంగా బదులివ్వడం తెలిసిందే.

ఇటీవల ఆయనను ఓ నెటిజన్ సార్ మీ విద్యార్హతలు ఏంటీ.? అని ప్రశ్నను సంధించారు. దానికి ఆయన చమత్కారంగా బదులిచ్చారు. తానున్న వయస్సులో తన అనుభవమే ముఖ్యమని, అర్హతతోనే అనుభవం సాధ్యమైందని చెప్పడంతో నెటిజనులు ఆయన చమత్కారంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఆయనకు ఆ ప్రశ్న సంధించిన నెటిజనుడిపై విమర్శలను సందించారు. కొన్నిసార్లు ఆయన స‍్పందనలు నెటిజన్లను నవ్వులు పూయిస్తాయి. అలాంటి మహీంద్రాను ఓ నెటిజన్‌ మీరు ఎన్నారైనా? అని అడిగినందుకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ రిప్లై సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్‌ మహీంద్రా అమెరికా న్యూయార్క్‌ సిటీ మాన్హాటన్‌లో ఉన్నారు. మాన్హాటన్‌లో ఉన్న ఆయన నగర అందాల్ని వర్ణిస్తూ ఫోటోల్ని, వీడియోల్ని ట్వీట్‌ చేశారు. వాటికి సంబంధించిన ట్వీట్‌లకు రిప్లయ్‌ ఇస్తుండగా..ఓ నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాను “మీరు ఎన్నారైనా?” అని అడగ్గా..అందుకు మహీంద్రా చమత్కారంగా నేను 'హెచ్‌ఆర్‌ఐ'(మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా) అని బదులిచ్చారు. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆనంద్‌ మహీంద్రాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “హా హా బాగుంది! మీ దిల్ హై హిందుస్తానీ! అని మాకు బాగా తెలుసు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తే..“సర్. మీరు ఎంఆర్‌ఐ (మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా)” అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles