Air India alerts people about hoax communication రూ.6000 ఆఫ‌ర్‌ బూట‌కం: ఎయిరిండియా `మ‌హారాజా` వార్నింగ్‌

Air india warns people about fake link offering rs 6000 calls it hoax communication

Air India, Aviation, Air India hoax message, Air India 75th Anniversary, Transportation Subsidy, social media, Air India Twitter, Air India Customers, Air India subsidy, Simple Questions, Aviation Industry, Tatasons, Customers Awareness

A hoax message has been circulating around about winning a chance to get Rs 6000 through a questionnaire as Air India 75th Anniversary Transport Subsidy on social media. Air India, took to their twitter account to make their customers aware about the online hoax circulating on social media claiming subsidy to the winners by simply answering questions about Air India such as a close ended question if they know Air India.

ఎయిరిండియా పేర‌ుతో సైబర్ నేరగాళ్ల దాడి.. రూ.6000 ఆఫ‌ర్‌ బూట‌కం: `మ‌హారాజా` వార్నింగ్‌

Posted: 07/04/2022 08:46 PM IST
Air india warns people about fake link offering rs 6000 calls it hoax communication

ఇప్పుడంతా డిజిట‌ల్ మీడియా.. ఆన్ లైన్ లోనే షాపింగ్‌.. ఫుడ్ ఆర్డ‌ర్‌.. క్యాబ్ బుకింగ్స్‌.. రైల్వే మొద‌లు బ‌స్సు నుంచి విమానాల వ‌ర‌కు టికెట్ల బుకింగ్ అంతా డిజిట‌ల్‌గానే సాగిపోతూ ఉంటుంది. ఇది ఎంత సునాయాసంగా పనులు చేసిపెడుతుందో.. అప్రమత్తంగా ఉండకపోతే అంతే ప్రమాదకరమని ఇప్పటికే అనేక సందర్భాల్లో చాలామందికి తెలిసి వచ్చింది. జేబులు గుల్లైన తరువాత ఎంత లబోదిబోమని మొత్తుకున్నా.. పోయిన సోమ్ము మాత్రం తిరిగిరావడం చాలాకష్టం. అనితర సాధ్యమనే చెప్పాలి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవం గురించి తెలియని అమాయ‌కుల‌ను సైబర్ నేరగాళ్లు బుట్ట‌లో వేసుకుంటున్నారు.

ర‌క‌ర‌కాల లింక్‌లు పంపి బురిడి కొట్టిస్తున్నాయి. ప్ర‌త్యేకించి దేశీయ కార్పొరేట్ దిగ్గ‌జ సంస్థ‌లు టాటా స‌న్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీల పేరిట ప్ర‌జ‌ల‌ను మోస‌గించేందుకు పూనుకుంటున్నాయి. తాజాగా ఫ్రాడ్‌స్ట‌ర్ల‌ జాబితాలోకి టాటా స‌న్స్ ఆధీనంలోని ఎయిరిండియా (మ‌హ‌రాజా) వ‌చ్చి చేరింది. ఎయిరిండియా 75వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ట్రాన్స్‌పోర్ట్ స‌బ్సిడీ అంటూ బూట‌క‌పు మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి పంపారు సైబ‌ర్ మోస‌గాళ్లు. ఒక క్వ‌శ్చ‌నీర్ (ప్ర‌శ్నావ‌ళి)ని పూర్తి చేసిన వారికి విమాణ ప్రయాణ టికెట్ల‌పై రూ.6000 రాయితీ పొందొచ్చున‌ని ఆ బూట‌క‌పు మెసేజ్ సారాంశం. వివిధ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై స‌ద‌రు మెసేజ్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

ఎయిరిండియా 75వ వార్షికోత్స‌వం పేరిట సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న బూట‌క‌పు మెసేజ్‌పై మ‌హ‌రాజా సంస్థ యాజ‌మాన్యం రియాక్ట‌యింది. త‌మ సంస్థ పేరిట వ‌చ్చే ఫ్రాడ్ లింక్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను.. ప్ర‌త్యేకించి విమాన ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్ జారీ చేసింది. ఆ లింక్‌ల మాయ‌లో ప‌డొద్ద‌ని హెచ్చ‌రించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ఎయిరిండియాను గ‌తేడాది అక్టోబ‌ర్ 8న వేలం ద్వారా టాటా స‌న్స్ గెలుచుకున్న‌ది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న లాంఛ‌నంగా ఎయిరిండియాను టేకోవ‌ర్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles