Police arrest suspect after gunman kills six at Chicago parade అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఆరుగురు మృతి

Us celebrates july 4 under the shadow of chicago highland park mass shooting

US gun violence, US mass shooting, mass shooting in chicago, US gun laws, July 4th, United States, Joe biden on gun laws, Juky 4 Parade in Chicago, celebration of july 4, fireworks for july 4th, Independence Day parade, Shooting, Robert Crimo, Gunman, Rifle, parade celebration, Joe Biden, gun law, gun violence, Illinois, Chicago, America, US

A shooting that left at least six people dead at an Independence Day parade in a Chicago suburb rattled Monday’s celebrations across the US and further rocked a country already awash in turmoil over high court rulings on abortion and guns as well as hearings on the Jan. 6 insurrection.

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై ఆగంతకుడి కాల్పులు..

Posted: 07/05/2022 11:47 AM IST
Us celebrates july 4 under the shadow of chicago highland park mass shooting

అమెరికాలో మరోమారు తూటాల పేలుళ్లు సంభవించాయి. దేశభక్తిని చాటేందుకు దేశప్రజలకు ఇచ్చే సెలవు దినమైన జూలై 4న షికాగోలో ఇల్లినాయిస్ పట్టణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై ఓ దుండగుడు అత్యంత దారుణంగా కాల్పులతో విరుచుకుపడ్డాడు. దేశ స్వాతంత్ర్య పరేడ్ లో పాల్గోని తమలోని దేశభక్తిని చాటిన ప్రజలపై రూఫ్ టాప్ గన్ తో విఛక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 36 మందికిపైగా గాయపడ్డారు. షికాగో శివారులోని ఇల్లినాయిస్ పట్టణంలోని హైలాండ్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్వాతంత్ర్య పరేడ్‌లో నిమగ్నమై తమ దేశభక్తిని ప్రకటించుకుంటూ పరేడ్ నిర్వహిస్తున్న వారిపై అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌తో దుండగుడు పైకప్పు నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అరెస్టు చేశారు. గత రాత్రి రాబర్ట్ ఇ.క్రిమో 3 అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి కారును చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టడంతో.. కారు నుంచి దిగి చేతులు పైకెత్తిన నిందితుడి వీడియోను అమెరికాలోని స్థానిక మీడియా విడుదల చేసింది. నిందితుడు క్రిమోపై పలు అభియోగాలు మోపినట్టు హైలాండ్ పార్క్ పోలీసులు తెలిపారు.

ప్రశాంతంగా జరుగుతున్న పరేడ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరగడంతో జనం భయంతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేలుతున్నట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షి అయిన రిటైర్డ్ వైద్యుడు రిచర్డ్ కౌఫ్‌మన్ తెలిపారు. దాదాపు 200 షాట్లను విన్నట్టు చెప్పారు. అయితే బాణాసంచా అని భావించానని చెప్పిన ఆయన కాల్పులు జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారని.. దీంతోనే తనకు ఇవి కాల్పులని అర్థంచేసుకున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాల్పుల విషయం తెలిసిన వెంటనే తాను, తన భార్య జిల్ షాకైనట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles