గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును.. గురువారం బలనిరూపణకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి అదేశాలపై బుదవారం అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించింది శివసేన. అయితే న్యాయస్థానం గవర్నర్ కోష్యారీ అదేశాలను సమర్థిస్తూ.. అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సిందిగా అదేశాలను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బలనిరూపణకు సుముఖంగా లేని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పదవితో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. కాగా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన క్రమంలో ముగిసిన క్యాబినెట్ భేటీలో ఉద్దవ్ థాక్రే.. తన మంత్రులను క్షమాపణలు కోరారు. ఎవరిపైనైనా, ఏ సందర్భంలోనైనా అవేశపడి వుంటే మన్నించాలని కోరారు. తన వాళ్లే తనకు నమ్మకద్రోహం చేశారని ఆయన భావోద్వేగంతో అన్నారు. కాగా, మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వర్గం మద్దతుతో రేపు దేవేంద్ర ఫడ్నావిస్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.
ఇక ఢిప్యూటీ సీఎంగా శివసేన రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేయనున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. మరోవైపు, మరికాసేపట్లో గోవాలోని తాజ్‌లో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్నాథ్ షిండే మాట్లాడతారు. అలాగే, మహారాష్ట్రలోని బీజేపీ కోర్ గ్రూప్ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సంకీర్ణ శివసేన రెబల్స్‌తో కీలక చర్చలు జరపనుంది. పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more