Ants commit robbery of gold chain? Netizens in SHOCK బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న చీమల ముఠా.! అరెస్టు చేయరేం.?

Ants commit robbery of gold chain netizens in shock after viral video surfaces

worlds little gold smugglers, ant viral video, steal gold, shocking video, trending, gold smugglling, Ants, ants robbery gold chain, gold chain robbery, animal video, viral video, twitter reactions, animal video funny, ants robbery video, viral video, trending news, ips deepanshu kabra, social media

Ants in a viral video shared on social media are seen carrying a gold chain. This has not only left the internet users amazed but also laughing out loud. Ants are known to work in groups but this clip sets a new example of sticking together and how there is strength in unity. The clip was shared online recently and has quickly won favours among a section of social media users.

ITEMVIDEOS: బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న చీమల ముఠా.! అరెస్టు చేయరేం.?

Posted: 06/30/2022 04:35 PM IST
Ants commit robbery of gold chain netizens in shock after viral video surfaces

బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై ధగధగ మెరుస్తుందనడంలో సందేహమే లేదు. అయితే నల్లని ఛాయతో ఉన్నవారి అందిరికీ బంగారం అంటే ఇష్టమని చెప్పనూ లేము. కానీ ఇక్కడ మాత్రం అది తాము తినే వస్తువు అనుకుంటున్నాయో.. లేక వాటికి నిజంగా సువర్ణం అంటే ఇష్టమో తెలియదు కానీ ఓ పెద్ద ముఠా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తోంది. తమ శక్తికి ఇది మించిన భారమని తెలిసినా.. ముఠా సభ్యులందరూ కలసి ఈజీగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు.

ఔనా, నిజమేనా అంటే.. ముమ్మాటికీ నిజమే. కానీ ఈ నల్లని వర్ణ జీవుల ముఠా అంతా కలగలసి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నా.. వాటిని మాత్రం ఎవరూ శిక్షించలేక పోతున్నారు. ఎందుకుంటారా.? వాటిని ఏ శిక్షాస్మృతి కింద శిక్షించాలో కూడా తెలియపోవడమే కారణం. ఈ ముఠా అంతా కలసి పట్టపగలు బంగారాన్ని తస్కరిస్తుంటే.. వాటిని అరెస్టు చేసేందుకు పోలీసులు ముందుకురారేం అంటరా.? ఎందుకంటే అవి చీమలు. అవి సైజులో చిన్నవి కాబట్టి అవి మోసుకెళ్లే వస్తువులు కూడా చిన్నవిగా ఉంటాయని అనుకుంటే పోరబాటే.  అయితే ఈ వీడియోలో ఏకంగా వాటి సైజుకు మించి, బంగారపు గొలుసుని దొంగలిస్తున్నాయి. అందుకే చీమలను కూడా చీప్‌గా చూడకూడదంటారు.

ఇంతకీ వీటికి బంగారంతో ఏం పని అంటారా.? చీమలు బంగారపు గొలుసు ఎత్తుకెళ్లడమేంటి.?, వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారు చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘‘చిన్ని గోల్డ్ స్మగ్లర్లు.. వీళ్లను ఏ ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయాలి?’’ అని కామెంట్‌ చేయగా, మరొకరు ‘‘ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవి బంగారం గొలుసును ఎందుకు తీసుకెళ్తున్నట్లు?’’ అని కామెంట్‌ చేశారు. చాలా వరకు ఆ చీమల గుంపు బంగారం గొలుసుని ఎత్తుకెళ్లడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles