రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన దుకాణంలోకి చోరబడిని ఇద్దరు ముష్కరులు ఆయనను అత్యంత దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. అయితే దర్జీ కన్నయ్య లాల్ మొండం నుంచి తలను వేరు చేసేంత దారుణానికి వారు ఒడిగట్టారు. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో ఇది దేశ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల ప్రమేయం ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో ఉగ్రకోణంలో ఈ హత్యకేసును నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తమను తాము ఇస్లామిక్ రాడికల్ గ్రూపుకు చెందిన వ్యక్తులుగా ప్రకటించుకున్న ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులు గౌస్ మహమ్మద్, రియాజ్ అహ్మెద్లు.. కరాచీ ఆధారిత సున్ని ఇస్లామిస్ట్ సంస్థ దావత్ ఈ ఇస్లామికు పరిచయస్తులని సమాచారం. దావత్ ఈ ఇస్లామికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ లబ్బైక్తో సంబంధం ఉందని.. ఉదయ్‌పూర్ హత్య ఘటన దర్యాప్తులో ఉన్న కొందరు చెబుతున్నారు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా అలజడులు సృష్టించాయి. నుపుర్ వ్యాఖ్యలను ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. దేశంలోనూ నిరసనలు చెలరేగాయి.ఈ క్రమంలోనే నుపుర్ శర్మకు మద్దతుగా.. ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్నయ్య లాల్.. సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మంగళవారం అతడి దుకాణంపై దాడి చేశారు రియాజ్, గౌస్. కత్తులతో అతడిని చంపేశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను కూడా చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉదయ్‌పూర్‌లో మతఘర్షణలు చెలరేగాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉదయ్‌పూర్‌లో కఠిన ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more