Government withdrew Rs 800 crore from GPF: Staff unions ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్లు విత్ డ్రా..

Government withdrew rs 800 crore from gpf staff unions

GPF Money withdraw, govt employees gpf money withdraw, ap govt employees money, ap govt employees pf money withdraw, andhra govt employee pf withdraw, GPF Money, provident Fund Withdraw, Andhra Pradesh Government Employees Association, GPF accounts, withdrawing, employees, PRC, DA arrears, Andhra Pradesh

Andhra Pradesh Government Employees Association president K Rama Suryanarayana on Tuesday accused the State government of withdrawing Rs 800 crore from the GPF accounts belonging to 90,000 employees without their knowledge. Speaking to mediapersons, he said some employees who noticed the withdrawal of the sum from their GPF accounts, informed the matter to him.

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్లు విత్ డ్రా..

Posted: 06/28/2022 09:54 PM IST
Government withdrew rs 800 crore from gpf staff unions

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ కావడం వారిని తీవ్రంగా కలవరపర్చింది. తమకు తెలియకుండా, తాము తీయకుండానే డబ్బులు డెబిట్ అయ్యాయని ఉద్యోగులు అరోపిస్తున్నారు. అయితే మూకుమ్మడిగా ఉద్యోగుల అందరి ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా కావడాన్ని పరిశీలిస్తే ఇది ప్రభుత్వం పనేనన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తపర్చారు. ఉద్యోగుల ఖాతాల నుంచి నగదు విత్‌ డ్రా చేసుకున్నట్టు గత రాత్రి సందేశాలు వచ్చాయని తెలిపారు. ఒక్కో ఉద్యోగి ఖాతా నుంచి ఒకలా డబ్బు విత్ డ్రా అయ్యిందని వారు తెలిపారు.

కాగా పీఎఫ్ ఖాతాలోంచి డబ్బులు విత్ డ్రా అయిన ఘటనపై ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ స్పందిస్తూ.. తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు విత్‌డ్రా చేశారని పేర్కొన్నారు. డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నారని, గడిచిన 6 నెలలుగా ఇచ్చిన డీఏ ఎరియర్స్‌ను మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. అయితే ఇక పీఎఫ్ ఖాతాలోంచి డబ్బులు విత్ డ్రా అయ్యాయా.? లేదా.? అన్నది చూసుకోవడమే ఉద్యోగులకు పనిగా మారనుందా.? అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

తాజాగా మొత్తం 90వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. గడచిన 6 నెలలుగా ఇచ్చిన డిఏ, అరియర్స్ ను మళ్ళీ వెనక్కు తీసుకున్నారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే.. సంబంధిత ఆర్థిక శాఖకు అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా? లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదన్నారు. ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేయడం నేరమని సూర్యనారాయణ పేర్కొన్నారు.

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లోంచి వారి తెలియకుండా డబ్బులు విత్ డ్రా చేయడం కూడా నేరమేనన్న ఆయన.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తారని తెలిపారు. మార్చి నెలలో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ తమకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా తప్పిదమేనన్నారు. ఆర్థిక శాఖలోని సీఎఫ్ఎంఎస్‌లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద తమ వేతన ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందని, ఇది ఎంత వరకు చట్టబద్దమని ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరగాలని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles