GST Council meeting: What will become costlier వీటిపై జీఎస్టీని పెంచేన కేంద్రం.. సామాన్యులకు షాక్.!

47th gst council meet several mass consumption items became expensive

GST Council meet, GST Council meet 2022, GST Council meeting, Finance Minister, GST rate hike, Nirmala Sitharaman, Ministy of Finance, GST Council, GST Council today, GST Council Meet today, hiking the rates for some goods and services, increase in, GST Council Meeting, Ministry of Finance, Niramala Sitharaman, Niramala Sitharaman, mass consumption items, Bank cheques, India, Economy & Policy

In the 47th meeting of the Goods and Services Tax (GST) Council, chaired by Union Finance Minister Nirmala Sitharaman, officials approved hiking the rates for some goods and services while removing exemptions for several mass consumption items to simplify the rate structure.

నిత్యావసర సరుకులపై జీఎస్టీని పెంచేన కేంద్రం.. సామాన్యులకు షాక్.!

Posted: 06/29/2022 11:34 AM IST
47th gst council meet several mass consumption items became expensive

కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై కూడా జీఎస్‌టీ అమలవుతుంది. తొలిరోజు సమావేశం అనంతరం జీఎస్టీ మండలి దేశంలోని సామాన్య ప్రజలను షాక్ గురిచేసింది. సామాన్యులు అధికంగా వినియోగించే అన్ని ఆహార పదార్థాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు కొన్నింటిపై 5శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఇక్కడ  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో రెండు రోజుల కీలక జీఎస్‌టీ మండలి 47వ సమావేశం ప్రారంభమైంది. మొదటిరోజు సమావేశం మంత్రుల బృందం చేసిన పలు సిఫారసులను ఆమోదించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్యాక్డ్, లేబుల్డ్‌ ఆహార ఉత్పత్తులు పొందుతున్న పన్ను మినహాయింపులను తొలగించాలని సుదీర్ఘ చర్చ తర్వాత మండలి నిర్ణయించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

పన్నులను హేతుబద్ధీకరించే ఉద్దేశంతో మినహాయింపులను ఉపసంహరించుకోవడానికి సంబంధించి రాష్ట్రాల మంత్రుల బృందం (జీఓఎం) చేసిన సిఫార్సులను చాలావరకూ మండలి ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  ప్రారంభించిన సమయానికి (2017 జూలై 1) 14.4 శాతంగా ఉన్న సగటు జీఎస్‌టీ రేటు ప్రస్తుతం 11.6 శాతానికి పడిపోయిన నేపథ్యంలో దీనిని పెంచడానికి జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణ అవసరమని మండలి ప్రధానంగా భావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

జీఎస్టీ మండలి సమావేశం తొలిరోజు నిర్ణయాలతో మరింత ప్రియంగా మారినవివే:

* చెక్కులు, పోగొట్టుకున్న లేదా పుస్తక రూపంలో 18 శాతం పన్ను విధించేందుకు GST కౌన్సిల్ అంగీకరించింది
* కౌన్సిల్ ఈ-వ్యర్థాలపై జీఎస్టీని గతంలో 5 శాతం నుంచి 18 శాతానికి పెంచింది
* రూ.1,000 లోపు హోటల్ వసతిపై 12 శాతం పన్ను విధించబడుతుంది
* 10 గ్రాముల కంటే తక్కువ ఉండే పోస్ట్ కార్డ్‌లు మినహా తపాలా శాఖ సేవలపై మినహాయింపును ఉపసంహరించుకునేందుకు కౌన్సిల్ అంగీకరించింది.
* చక్కెర, సహజ ఫైబర్ వంటి పన్ను విధించదగిన వస్తువుల నిల్వలపై జీఎస్టీ
* గిడ్డంగులపై మరియు గిడ్డంగులకు ధూమపానం వంటి సేవలపై GST మినహాయింపును ఉపసంహరించుకోవడానికి కౌన్సిల్ అంగీకరించింది.
* ఎల్‌ఈడీ దీపాలు, ఇంక్‌లు, కత్తులు, బ్లేడ్‌లు, పవర్‌తో నడిచే పంపులు, డెయిరీ మెషినరీలపై విధించే జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచనున్నారు.
* వివాదాలను నివారించడానికి రిటైల్ విక్రయం కోసం 'బ్రాండెడ్' అనే పదాన్ని 'ప్రీ-ప్యాకేజ్డ్ మరియు లేబుల్'తో భర్తీ చేయడానికి కౌన్సిల్ అంగీకరించింది.

* తృణధాన్యాల మైలింగ్ యంత్రాలపై పన్ను 5 శాతం నుంచి 18 శాతానికి, సోలార్ వాటర్ హీటర్, ఫినిష్డ్ లెదర్‌పై జీఎస్టీ 12 శాతానికి పెంపు
* పెట్రోలియం కోసం నిర్దేశిత వస్తువులపై GST విలోమాన్ని సరిచేయడానికి ఇన్‌పుట్ వస్తువులపై 5 శాతం నుండి 12 శాతానికి పెంచబడుతుంది.
* ఇంతలో, విలోమాన్ని సరిచేయడానికి ప్రభుత్వం, స్థానిక అధికారులకు సరఫరా చేసే వర్క్ కాంట్రాక్ట్ సేవలపై పన్ను 18 శాతానికి
* ఈశాన్య రాష్ట్రాలకు, రోడ్డు, రైలు రవాణాపై, విమాన బిజినెస్ క్లాస్  ప్రయాణాలపై మినహాయింపు  
* జంతువులను వధించే సేవలపై మినహాయింపు కూడా ఉపసంహరించబడుతుంది
* తినదగిన నూనెలు, బొగ్గులో విలోమ డ్యూటీ నిర్మాణం కారణంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్‌ను అనుమతించకూడదని కౌన్సిల్ అంగీకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh