Draupadi Murmu NDAs' Presidential Candidate ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..

Jp nadda announces draupadi murmu as nda presidential candidate

Draupadi murmu, Jagath Prakash Nadda, BJP President, BJP Parliamentary meet, President Election 2022, President Election 2022 schedule, President Election 2022 date, President Election 2022 India, Rajnath Singh, Amit Shah, Venkaiah Naidu, President Election 2022 BJP candidates, President Election 2022 result, Presidential Polls, NDA, BJP, Amit Shah, NDA Presidential Candidate, Rajnath Singh, M Venkaiah Naidu, National Politics

BJP-led NDA announced former Governor of Jharkhand Draupadi Murmu’s name as a Presidential candidate for the upcoming elections. Addressing the Press Conference after BJP’s Parliamentary Board meeting, Party President JP NAdda said, “For the first time, preference has been given to a woman tribal candidate. We announce Draupadi Murmu as NDA's candidate for the upcoming Presidential elections.”

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. బీజేపి ప్రకటన..

Posted: 06/22/2022 10:43 AM IST
Jp nadda announces draupadi murmu as nda presidential candidate

రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తోన్న వేళ విపక్షాలు ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే పక్షం కూడా తమ రాష్ట్రపతి అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో రసవత్తరంగా మారనున్న రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపి ఆచితూచి అడుగులు వేస్తూ.. తమ అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌప‌ది ముర్ము బ‌రిలోకి దింపనుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో బీజేపీ అగ్ర‌నేత‌లు ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా మంగళవారం రాత్రి ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఝార్ఖండ్ గ‌వ‌ర్నర్ గా ప‌నిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించింది. ఇక ద్రౌప‌ది ముర్ము వ్య‌క్తిగ‌త వివ‌రాల్లోకి వ‌స్తే... ఒడిశాలోని మ‌యూర్భంజ్ జిల్లా బైద‌పోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే ఆదివాసీ తెగ కుటుంబంలో ముర్ము జ‌న్మించారు. ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించిన ముర్ము...శ్యామ్ చ‌ర‌ణ్ ముర్మును వివాహ‌మాడారు. ఈ దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండ‌గా... చాలా కాలం క్రిత‌మే భ‌ర్త‌తో పాటు ఇద్ద‌రు కుమారులు చ‌నిపోయారు. ముర్ము రాజ‌కీయ ప్ర‌స్థానం విష‌యానికి వ‌స్తే... అమె తన రాజకీయ ప్రస్తానాన్ని బీజేపి పార్టీ నుంచే ప్రారంభించింది.

ఒడిశాలో 2000 మార్చిలో కొలువుదీరిన బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ముర్ము.. మంత్రిగా స‌త్తా చాటారు. ఆ త‌ర్వాత 2015లో ఝార్ఖండ్ గ‌వ‌ర్నర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ముర్ము... ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు గ‌వ‌ర్న‌ర్‌గా కొనసాగిన తొలి గ‌వ‌ర్న‌ర్‌గా చరిత్ర సృష్టించారు. తాజాగా ఆమె ఎన్డీఏ త‌ర‌ఫున రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎన్నికయ్యారు. అయితే ప్రధానమంత్రి అభ్యర్థిగా తన శక్తిసామర్థ్యాలున్న వెంకయ్యనాయుడును కావాలని పక్కకు తప్పించిన బీజేపి.. ఆయనను ఉపరాష్ట్రపతిగా చేసింది. ఈ సారి ఆయనకు రాష్ట్రపతి రేసులో నిలచే అవకాశం కూడా కల్పించనుందన్న తరుణంలో ఆయనకు రిక్తహస్తాలను చూపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles