గోవా పర్యటనకు వెళ్లిన కన్నడ హీరో దిగంత్ మంచలే ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నడ హీరో దిగంత్ మంచలే ఇటీవల తన భార్య ఐంద్రిత రేతో గోవా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భార్యతో కలసి బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా, ఆయనకు బీచ్‌లో ట్రంపోలైన్ కనబడింది. దీంతో దానిపై నిల్చోని ఆయన కూడా కొద్దిసేపు జంప్ చేశారు. ఈ క్రమంలో సరదాగా అనిపిస్తుండటంతో ఆయన మరింతగా ఎగురుతుండగా ఆయన పట్టుతప్పి పడిపోయాడు. దీంతో ఆయన మెడ వద్ద తీవ్రమైన నోప్పి ఏర్పడింది.
దిగంత్ మంచాల్ ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. ఇక ఆయన పరిస్థితి మెరుగుకాకపోవడంతో.. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు. వాన’ చిత్రంలో కీ రోల్ పోషించిన దిగంత్‌కు అడ్వెంచర్స్ చేయడం అంటే ఆసక్తి. దీంతో తరచూ అతడు సైకిలింగ్, ట్రెక్కింగ్, సముంద్రంలో స్క్యూబా డైవింగ్ చేస్తుంటాడు. అంతేకాదు ఈ వీడియోలను తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటాడు. కాగా గాలిపాట, హౌస్‌ఫుల్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దిగంత్ ఇటీవల నటించిన గాలిపాట 2 మూవీతో ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ నటించిన ‘ఎవరు’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more