Groom fined Rs 2 lakh for baraat in Uttar Pradesh ఆడీ ఓపెన్ టాప్ కారులో వరుడి డాన్స్.. రూ.2 లక్షల జరిమానా.!

Groom fined rs 2 lakh for dancing in an open audi in uttar pradesh

Bridegroom finned Rs 2 Lakhs, groom bataat on national highway, Muzaffarnagar-Haridwar national highway, fellow commuters, 'baraatis', Ankit Yadav, Haridwar- Noida, Uttar Pradesh police, Muzaffarnagar, Uttar Pradesh, Crime

A well-planned wedding entrance in Muzaffarnagar, Uttar Pradesh, went horribly wrong after a video of the event became viral on social media. The groom along with his friends pulled off the stunt on the Muzaffarnagar-Haridwar national highway, endangering lives of fellow commuters

ITEMVIDEOS: ఆడీ ఓపెన్ టాప్ కారులో వరుడి డాన్స్.. రూ.2 లక్షల జరిమానా.!

Posted: 06/16/2022 04:03 PM IST
Groom fined rs 2 lakh for dancing in an open audi in uttar pradesh

జీవితంలో జరిగే అతిపెద్ద సంబరం వివాహం. అందుకనే ఈ పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే అనేకం ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక పెళ్లి అనగానే పెళ్లి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్ నుంచి మొదలుపెట్టుకుని పెళ్లైన తరువాత వింధు వరకు అన్ని రకాల ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే పెళ్లి కంటే భరాత్ ఊరేగింపు వీడియోలే అధికంగా ఈ మధ్యకాలంలో దర్శనమిస్తున్నాయి. పెళ్లి సహా ఈ వేడుక పూర్వాపరాల మధురానుభూతి జీవితాంతం గుర్తుండాలని వధూవరులు ఘనంగా చేసుకుంటారు.

ఇలానే తన పెళ్లికి జరిగిన ఉత్సాహంలో తన స్నేహితులు సరదాగా తీస్తున్న బరాత్ కార్యక్రమం ఆ వరుడికి అదనపు వడ్డింపులను అందుకునేలా చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వరుడికి ఈ వింత అనుభవం ఎదురైంది. అదేంటి పెళ్లి బరాత్ నిర్వహిస్తే వడ్డింపులా.? ఎవరు వేశారు.? ఎందుకనీ వేశారు.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.? అయితే మ్యాటర్ లోకి ఎంటర్ కావాల్సిందే.  యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు కూడా అలాగే అనుకున్నాడు. అందుకనే వరుడు, అతడి మిత్రబృందం ఎనిమిది కార్లతో జాతీయ రహదారిపైకెక్కి విన్యాసాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.

వరుడు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతని బరాత్ కోసం టాప్ లెస్ ఆడికారును తమ కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. దీంతో పెళ్లైన తరువాత వరుడు తన ఆడికారులోకి వెళ్తుండగా, అతని స్నేహితులు మరో ఎనమిది కార్లలో.. అతడ్ని అనుసరించారు. ఇలా ఏ రహదారిలోనో చేసుకుంటూ వెళ్తే, ఎవరూ పట్టించుకునేవారు కాబోలు.. కానీ ఏకంగా ముజాఫర్ నగర్-హరిద్వార్ ఎక్స ప్రెస్ రహదారిపై కూడా వరుడు.. అతని స్నేహితులు బారత్ నిర్వహించారు. వరుడు తన ఆడికారును ఎక్కి నిల్చోగా, మిగతా వారిలో కొందరు కార్లపైకెక్కి సెల్ఫీలు తీసుకుంటే, మరికొందరు కారు డోర్లపై కూర్చుని విన్యాసాలు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ డ్యాన్సులు చేశారు మరికొందరు.

ముజఫర్‌నగర్-హరిద్వార్‌ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదకర ఊరేగింపును తోటి వాహనదారులకు ప్రమాదాలకు గురిచేసే అవకాశం పోంచివుంది. దీంతో ఆ దారినపోయే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఈ ఊరేగింపు ఏంటంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టేలా ఊరేగింపు జరగడంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం ఇలా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి తోయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ ప్రెస్ రహదారిపై ఇంత జరుగుతున్నా రహదారి నిర్వహణ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

కాగా ఈ రహదారిపై ప్రయణించిన ఓ నెటిజను ఈ వీడియో తీసి.. దానిని  ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ కు షేర్ చేశారు. తన పేరు అంకిత్ యాదవ్ అని.. తాను హరిద్వార్ నుంచి నోయిడా వెళ్తుండగా, ఎక్స్ ప్రెస్ హైవే దారిలో ఓ ప్రాంతంలో ఓ పెళ్లికొడుకు తన కారులో బరాత్ ఊరేగింపులా వస్తున్నాడని.. అతడ్ని ఫోటోలు, వీడియోలు తీయడంలో స్నేహితులు బిజీగా వున్నారని.. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు వరుడి కారు సహా ఊరేగింపులో పాల్గొన్న 8 కార్లను సీజ్ చేశారు. కార్ల యజమానులకు ఏకంగా రూ. 2 లక్షల జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles