Nagpur ATM machine dispenses 5-fold cash ఆ ఏటీయంలో రూ. 500 విత్‌డ్రా చేస్తే.. రూ.2,500 వచ్చాయి..

Atm in maharashtra dispenses 5 times extra cash locals rush in after news

ATM 5 Times Extra Cash, Nagpur ATM, ATM Gives Extra Money, private bank ATM, ATM, Extra cash, ATM transaction, Nagpur ATM, Khaparkheda town, Nagpur Police, Nagpur district, Maharashtra

A man was in for a pleasant surprise when he tried to withdraw ₹ 500 from an ATM, but got five currency notes of ₹ 500 denomination from the cash dispenser in Maharashtra's Nagpur district. He repeated the process and again got ₹ 2,500 while trying to withdraw ₹ 500. This happened on Wednesday at the Automated Teller Machine (ATM) of a private bank in Khaparkheda town, located around 30 km from Nagpur city.

రూ. 500 విత్‌డ్రా చేస్తే.. రూ.2,500 వచ్చాయి.. ఏటీయం వద్ద బారులు తీరిన జ‌నాలు

Posted: 06/16/2022 05:16 PM IST
Atm in maharashtra dispenses 5 times extra cash locals rush in after news

ఎప్పుడో 2017 చివర్లో, 2018లలో దేశంలోని అనేక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వింత ఘటనలు.. ఆ తరువాత అప్పడప్పుడూ ఎక్కోడో ఓ ప్రాంతంలో సంభవిస్తూనే ఉన్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. దేశంలో పెద్దనోట్ల రద్దు పేరుతో అంతకు రెండింతల పెద్దనోటును చెలమణిలోకి తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వం.. ఇందుకు అవినీతి నిర్మూలణ, నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట అని చెప్పింది. అయితే తాజాగా చలామణిలోకి వచ్చిన కొత్త నోట్లలో దొంగనోట్లు కూడా అధికంగానే వాటాను పంచుకున్నాయని తాజాగా అర్బిఐ వెల్లడించింది. దీంతో కేంద్రం కొండను తవ్వి ఎలుకను పట్టిందా.? అన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

ఇక నోట్లరద్దు ప్రకటన నేపథ్యంలో గుండె అగిపోయి.. పాత నోట్లు పెద్దసంఖ్యలో ఉన్న కోందరు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. ఇక ఆతరువాత బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద.. లైన్లలో నిలబడి గుండెపోటుతో మరణించినా వారి సంఖ్య కూడా దేశవ్యాప్తంగా పెద్దగానే ఉంది. అమ్మాయిల పెళ్లిపెట్టుకుని వరుడి కుటుంబానికి ఇస్తామన్న కట్నకానుకలు ఇవ్వలేక, ఎక్కడ మాటవస్తుందోనని ఆత్మహత్యలకు పాల్పడిన వధువు తండ్రులు కూడా ఉన్నారు. అయితే ఈ మరణాలన్నీ ఎవరిదీ బాధ్యత. ఇవి ప్రభుత్వ ప్రళయాత్మక నిర్ణయ మరణాలేనా.? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ విషయాలను పక్కనబెడితే.. అప్పుట్లో అడపాదడపా పలు ఏటీయం కేంద్రాలలో ఐదు వందలు డ్రా చేస్తే.. రెండు వేలు వచ్చాయని, లేదా.. ఏటీయం కేంద్రంలోని డబ్బు మొత్తం వచ్చిందని, ఏటీయం లాకర్ తలుపు తెరుచుకుందని, ఇలాంటి వార్తలు మాత్రం చాలా రోటీన్ గా వినిపించాయి. అయితే ప్రస్తుతం ఎప్పుడో కానీ వినిపించడం లేదు. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. కానీ ఆయ‌న కోరుకున్న న‌గ‌దు కంటే ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన స‌ద‌రు వ్య‌క్తి.. మ‌ళ్లీ అదే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌ళ్లీ ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు వ‌చ్చింది.

తాను కేవలం తనకు కావాల్సినంత విత్ డ్రా చేసుకుందామనుకుంటే అంతుకు ఐదింతల క్యాష్ వస్తోందని సంతోషపడ్డాడు. అయితే ఈ విష‌యాన్ని తనకు తెలిసినవాళ్లతో పాటు ఏటీయం కేంద్రం వద్దనున్న ఇతరులతో కూడా పంచుకున్నాడు. ఇంకేముందు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయంటే బెల్లం చుట్టూ మూగిన ఈగల మాదిరిగా ఏటీయం కేంద్రం చుట్టూ స్థానికులు బారులు తీరారు. నిమిషాల వ్యవధిలోనే ఏటీయం కేంద్రం వద్ద పెద్ద క్యూ ఏర్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖ‌ప‌ర్‌ఖేడా ప‌ట్ట‌ణంలోని ఓ ఏటీఎం వ‌ద్ద‌ ఈ ఐదింతల మొత్తం వస్తోంది. ఈ విషయం తెలిసి ఏటీఎం వ‌ద్ద న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు స్థానికులు బారులు తీరారు.

మ‌హారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని ఖ‌ప‌ర్‌ఖేడా ప‌ట్ట‌ణంలోని ఓ ఏటీఎం వ‌ద్ద‌కు న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్య‌క్తి వెళ్లాడు. అత‌నికి రూ. 500 అవ‌స‌రం ఉండ‌టంతో.. అంతే న‌గ‌దు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ రూ. 500ల‌కు బ‌దులుగా రూ. 2,500 వ‌చ్చాయి. మ‌ళ్లీ రూ. 500 విత్ డ్రా చేశాడు. మ‌ళ్లీ రూ. 2,500 వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆ వ్య‌క్తి అక్క‌డున్న వారికి చెప్ప‌డంతో క్ష‌ణాల్లోనే వంద‌ల మంది ఏటీఎం వ‌ద్ద బారులు తీరారు. ఈ విష‌యం పోలీసుల‌కు చేర‌డంతో.. ఏటీఎం మూసివేయించి.. బ్యాంకు అధికారుల‌కు స‌మాచారం అందించారు. సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే విత్ డ్రా చేసిన న‌గ‌దు కంటే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని బ్యాంకు అధికారులు వెల్ల‌డించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles