HDFC Bank Alert Customers on Fraudsters ఖాతాదారులను అప్రమత్తం చేసిన హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు..

Hdfc bank customers alert if you do this you will lose money to fraudsters

HDFC Bank, HDFC Bank twitter, HDFC Bank fraud, bank scam, fraud SMS, PAN frauds, HDFC Bank fake sms, bank fake sms

The HDFC Bank has shared an important update related to PAN with customers of the lender. PAN card data is also sensitive. This can make fraudsters to use someone’s PAN to scam them by sending fake SMS. The HDFC Bank has alerted customers regarding this.

ఆ విషయంలో ఖాతాదారులను అప్రమత్తం చేసిన హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు..

Posted: 06/13/2022 03:39 PM IST
Hdfc bank customers alert if you do this you will lose money to fraudsters

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ జారీ చేసింది. తమ బ్యాంకు కస్టమర్లు తప్పనిసరిగా పాన్ కార్డు డాటాను గోప్యంగా భద్రపర్చుకోవాలని సూచించింది. పాన్ కార్డు డేటా లీక్ ద్వారా కూడా గోప్యంగా ఉండాల్సిన కస్టమర్ల ఆర్థిక లావాదేవీల సమాచారం పరాయివ్యక్తుల చేతికి లభిస్తుందని.. ఇక దీంతో సైబర్ నేరగాళ్లు అక్రమలాకు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయని బ్యాంకు యాజమాన్యం కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఏటీయం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తరహాలోనే పాన్ కార్డు కూడా ఆ వ్యక్తి ఆర్థిక స్థితిని తెలిపే సున్నితమైన సమాచారం కలిగిఉంటుందని తెలిపింది.

పాన్ కార్డు పివీసీ కార్డు తరహాలో ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డుపై వ్యక్తుల పర్మినెంట్ అడ్రస్ నెంబరు (శాశ్వత చిరునామా నెంబరు)ను కలిగి ఉంటుందని, దీని ఇది వ్యక్తి ఆర్థిక లావాదేశీలకు సంబంధించిన కీలక ఆధారమని ఆదాయపన్ను, బ్యాంకు లావాదేవీల విషయంలో ఇది అత్యంత అవసరమన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్డును భారత ఆదాయపన్ను శాఖ జారీ చేస్తోంది. ఈ కార్డు పది అంకెల ప్రత్యేక నెంబరు కలిగిఉంటుంది. ఈ నెంబరు ఆధారంగానే ఈ కార్డు ఫలానా వ్యక్తికి అన్న స్పష్టత లభిస్తుంది. ఒకరికి కేటాయించిన నెంబరు మరోకరికి కేటాయించబడకుండా ఆదాయపన్నుశాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇక ఎస్బీఐ కస్టమర్లను టార్గట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లను కూడా టార్గెట్ చేశారు. మీ ఎస్బీఐ అకౌంట్ క్లోజ్ అయ్యింది. తక్షణం స్పందించండీ అంటూ మెసేజ్ లు పంపి ఎస్బీఐ కస్టమర్లను టార్గట్ చేసిన నేరగాళ్లు.. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లను మరో కొత్త రకం మోసంతో టార్గెట్ చేశారు. హెచ్డీఎప్సీ బ్యాంకు కస్టమర్లు తమ పాన్ కార్డను అప్ డేట్ చేసుకోవాలని.. లేకపోతే లావాదేవీలు నిలిచిపోతాయని కూడా హెచ్చరికలతో కూడా సందేశం పంపుతోంది. అయితే ఇది నిజంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు యాజమాన్యం పంపే సందేశం కాదు. దీంతో కస్టమర్లు బ్యాంకు అధికారులకు పిర్యాదులు చేయగా, బ్యాంకు అప్రమత్తమైంది.

తమ దేశవ్యాప్త కస్టమర్లను అలర్ట్ చేసింది. కస్టమర్లను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తం చేసింది. మీ పాన్ కార్డ్ స‌మాచారం అప్‌డేట్‌ కోసం మీకు పంపిన ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ క్లిక్ చేయ‌మ‌ని మోస‌గాళ్లు కోర‌తార‌ని, దాన్ని క్లిక్ చేయొద్ద‌ని కోరింది. పాన్ కార్డ్ డిటైల్స్ అప్‌డేట్ చేయాల‌ని కోరుతూ మీకు వ‌చ్చే గుర్తు తెలియ‌ని లింక్‌ల‌ను క్లిక్ చేయొద్ద‌ని.. పోరబాటున ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డేటాతో పాటు మీ అకౌంట్లోని నగదు కూడా మాయం అవుతుందని బ్యాంకు అధికారులు తమ కస్టమర్లను అప్రమత్తం చేశారు. #గో డిజిట‌ల్ గో సెక్యూర్ (#GoDigitalGoSecure ) అని పేర్కొంది.

బ్యాంకు వెబ్‌సైట్ లేదా ఏదేనీ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ ద్వారా గానీ. బ్యాంక్ వెబ్‌సైట్ మాదిరిగానే థ‌ర్డ్ పార్టీ ఫిషింగ్ వెబ్‌సైట్ సృష్టించి సైబర్ నేరగాళ్లు బ్యాంకుల ఖాతాదారుల త‌ప్పుదోవ ప‌ట్టిస్తార‌ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్చ‌రించింది. సోష‌ల్ మీడియా, ఎస్సెమ్మెస్‌, ఇన్‌స్టంట్ మెసేంజ‌ర్ ద్వారా ఈ వెబ్‌సైట్ల లింక్‌ల‌ను మోసగాళ్లు స‌ర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ప‌లువురు క‌స్ట‌మ‌ర్లు డిటైల్డ్ యూనిఫామ్ రీసోర్స్ లొకేట‌ర్ (యూఆర్ఎల్‌) తెలుసుకోకుండానే ఈ లింక్‌ల‌ను క్లిక్ చేస్తారు. ప‌ర్స‌న‌ల్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్ (పిన్‌), వ‌న్‌టైం పాస్‌వ‌ర్డ్ (ఓటీపీ), పాస్‌వ‌ర్డ్ త‌దిత‌ర సెక్యూర్డ్ క్రెడెన్షియ‌ల్స్ న‌మోదు చేస్తారు. వీటిని మోసగాళ్లు వీటిని క్యాప్చ‌ర్ చేసేసి.. ఆ బ్యాంకులోని ఖాతాదారుల సొమ్మును స్వాహా చేస్తార‌ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.

ఇక సైబర్ నేరగాళ్ల నుంచి తమ బ్యాంకు కస్టమర్లు ముందస్తు ర‌క్ష‌ణ ఎలా తీసుకోవాలో కూడా సూచనలు చేసింది. గుర్తు తెలియ‌ని వ్యక్తుల ఫోన్ నెంబర్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్ లను,  ధృవీక‌రించ‌ని లింక్‌ల‌ను క్లిక్ చేయొరాదని సూచించింది. గుర్తు తెలియ‌ని సంస్థల నుంచి వచ్చే ఎంఎస్ఎం లను, ఈ-మెయిల్స్‌ను త‌క్ష‌ణం డిలిట్ చేయాలని సూచనలు చేసింది. మీకు సబ్ స్ర్కైబ్ చేయకుండానే వచ్చే (అన్‌స‌బ్‌స్క్రైబ్డ్) ఈ-మెయిల్స్ పంపే బ్యాంక్ లేదా ఈ-కామ‌ర్స్ లేదా సెర్చ్ ఇంజిన్ లింక్‌ల‌ను డిలిట్ చేయ‌డంతోపాటు ఆ ఈ-మెయిల్స్‌ను బ్లాక్ చేయాలని సూచనలు చేసింది.

ఎల్ల‌వేళ‌లా మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. ఫైనాన్సియ‌ల్ క్రెడెన్షియ‌ల్స్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ల‌ను జాగ్ర‌త్త‌గా వెరిఫై చేసుకున్నాకే వాటిలోకి వెళ్లాలి. మీకు వ‌చ్చిన ఈ-మెయిల్స్‌లో స్పెల్లింగ్ త‌ప్పులు, మీ యూఆర్ఎల్స్ చెక్ చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్ప‌దంగా ఉంటే సంబంధిత బ్యాంకు అధికారికి స‌మాచారం.క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో విధించిన లాక్‌డౌన్ వేళ డిజిట‌ల్ పేమెంట్స్ పుంజుకున్నాయి. ఫైనాన్సియ‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ పుంజుకున్నాయి.. వాటితోపాటు రిటైల్ లావాదేవీల‌తోపాటు సైబ‌ర్ మోసాలు కూడా పెరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles