RBI allows linking credit cards with UPI యూపీఐతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి అనుమతి..

Rbi monetary policy credit cards can now be linked to your upi

upi credit card link, upi credit card, upi credit card india, upi credit card payment, upi credit card charges, upi using credit card, rbi upi credit card, credit card upi, credit card upi news, credit card upi payment, credit card upi rbi, credit card upi payment charges, UPI, RuPay, Credit cards, Visa Mastercard, Payment Limit, RBI, Governor, Shaktikanta Das, Inflation, India Economy

Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das on Wednesday allowed the linking of credit cards on the UPI platform. During his speech where the central bank chief announced a 50 basis points (bps) hike in the repo rate to curb the rising inflation, Das announced this key regulatory measure which is likely to benefit most credit card holders in the future.

యూపీఐతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి అనుమతి.. చెల్లింపులపై పరిమితి

Posted: 06/08/2022 05:57 PM IST
Rbi monetary policy credit cards can now be linked to your upi

నవంబర్ 8, 2016 రాత్రి ఎనమిది గంటలు.. ఈ తేదీ, సమయం గుర్తున్నాయా.. అప్పటి వరకు ఉన్న దేశంలోని పెద్ద నోట్లు ఆ క్షణం నుంచి రద్దు చేయబడ్డాయి. ఆ తరువాత భారత కర్సెనీ నోట్లలో అంతకన్నా పెద్దనోటు ఏకంగా రెండు వేల రూపాయల నోటు చెలామణిలోకి వచ్చింది. అందుకు కారణాలను పక్కనబెడితే.. ఆ తరువాతి రోజు నుంచి దేశంలో ఒక్కసారిగా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. పెట్రోల్, డీజిల్ సహా కిరాణా సరుకులు, నిత్యావసర సరుకుల.. చివరకు బంగారు ఆభరణాలు కొనాలన్నా అంతా డిజిటల్ పేమెంట్సే. దేశంలోని ప్రజలను ఆ ఒక్క నిర్ణయం అంతలా మర్చేసింది.

యూపీఐ చెల్లింపులను ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల నుంచే చేసుకునే సదుపాయం ఉంది. కానీ ఇక మీదట క్రెడిట్ కార్డులతోనూ యూపీఐ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇందుకు వీలుగా క్రెడిట్ కార్డులు, రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. యూపీఐ భారత్ లో మరింత సమగ్రమైన చెల్లింపుల విధానంగా అవతరించింది. 26 కోట్ల యూజర్లు, ఐదు కోట్ల వ్యాపారులు ఈ ప్లాట్ ఫామ్ పై నమోదై ఉన్నారు. ఇటీవలి కాలంలో యూపీఐ ఎంతో పురోగతి సాధించింది. తమ దేశంలోనూ ఈ విధానం అమలుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి’’అని శక్తికాంతదాస్ తెలిపారు.

ఈ ఏడాది ఒక్క మే నెలలోనే 594 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.10.4 లక్షల కోట్లుగా ఉంది. కార్డులపై ఈ మ్యాండేట్ చెల్లింపుల పరిమితిని రూ.5,000 నుంచి రూ.15,000కు ఆర్బీఐ పెంచింది. తరచూ చేసే చెల్లింపులకు ఈ మ్యాండేట్ సదుపాయం అనుకూలిస్తుంది. ఉదాహరణకు బీమా ప్రీమియంను ఏటా నిర్ణీత గడువులోపు చెల్లించాలని ఈ మ్యాండేట్ ఇస్తే.. కార్డు నుంచి ఆటోమేటిక్ గా చెల్లింపులు జరుగుతాయి. ఇప్పుడు ఈ పరిమితిని ఆర్బీఐ పెంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UPI  RuPay  Credit cards  Visa Mastercard  Payment Limit  RBI  Governor  Shaktikanta Das  Inflation  India Economy  

Other Articles