ప్రేమకు ప్రతిరూపంగా తల్లిని చెప్పుకుంటారు. అయితే అదే బిడ్డను దారిలో పెట్టాలంటే కూడా కొంత మనసు కఠినం చేసుకునే మందలిస్తారు. అయితే కొందరు తల్లలు మాత్రం అందుకు పూర్తి భిన్నం. మరీ కఠినంగా మారిపోయి.. తమ బిడ్డ తాము చెప్పినట్టే చేయాలని భావిస్తుంటారు. అలాంటి తల్లే ఒకరు ఢిల్లీలో దర్శనమిచ్చింది. తన ఎనమిదేళ్ల చిన్నారి కూతుర్ని అత్యంత దారుణంగా శిక్షించింది. ఈ వేసవిలో మండుటెండలో తమ పిల్లలు బయటకెళ్లి ఆడుకుంటేనే అల్లాడిపోయే తల్లుతున్న ఈ దేశంలో.. తన బిడ్డ చెప్పిన పని చేయలేదని కాళ్లు చేతులు కట్టేసి.. దారుణంగా మండుటెండలో ఇంటి మేడపై పడుకోబెట్టింది.
తల్లి వేసిన శిక్షను తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి.. కొద్ది సేపటికి ఎండతో తన ఒళ్లు కాలిపోతుండటంతో బాగా గట్టిగా ఏడ్చేసింది. దీంతో ఇరుగుపోరుగు వారు ఎక్కడో బాలిక ఏడుస్తోందని గ్రహించారు. తీరా చూస్తే కాళ్లుచేతులు కట్టేసిన ఓ చిన్నారి ఎండకు తట్టుకోలేక ఏడుస్తుందని గ్రహించారు. ఈక్రమంలో కోందరు నెటిజనులు బాలిక ఏడుపును వీడియో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారేు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక కోందరు ఆ తల్లి చేసిన నిర్వాకంపై పోలీసులకు పిర్యాదు చేశారు. అప్పటికే వీడియో కూడా వైరల్ కావడంతో దానిపై దృష్టి సారించిన పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఘటన కారవాల్ నగర్‌లో చోటు చేసుకుంది. అక్కడకు చేరుకున్న పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత ఘటన ఖజూర్ ఏరియా జరిగినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు ఇంటిని గుర్తించారు. చిన్నారి కుటుంబీకులను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు విచారణలో తల్లి హోంవర్క్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా.. పెడచెవిన పెట్టి ఎండలో అడుతుందని అందుకనే ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు శిక్షించానని, ఆ తర్వాత బిడ్డను కిందకు దించాపపి చిన్నారి తల్లి వివరణ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more