J&K L-G orders migrant officials shifted to respective HQs కాశ్మీర్ లోని ప్రభుత్వ ఉద్యోగుల రక్షణకు.. కేంద్రం కీలక నిర్ణయం.!

J k lg orders posting of kashmiri hindu govt employees in valley to secured locations by 6 june

Kashmir, Kashmir Hindu, secured locations, J&K LG Manoj Sinha, Terrorists, Killing of Hindus, Employees, sikh, rajni bala, rahul bhat, manoj sinha, gopalpora, Kupwara, Kulgam, Jammu and Kashmir, Crime

After a rise in targeted attacks on minorities in Kashmir, Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha has ordered the officials to post PM Package employees and other members from minority communities in Kashmir at secure locations by 6 June.

జమ్మూకాశ్మీర్ లోని ప్రభుత్వ ఉద్యోగుల రక్షణకు.. కేంద్రం కీలక నిర్ణయం.!

Posted: 06/02/2022 06:49 PM IST
J k lg orders posting of kashmiri hindu govt employees in valley to secured locations by 6 june

జమ్మూకశ్మీర్‌లో హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు లోయలోని హిందువులను టార్గెట్ గా చేసుకుని దాడులకు దిగుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక గత నెలరోజుల వ్యవధిలో ఎనిమిది మంది హిందువులను చంపిన ముష్కరులు.. ముగ్గురు హిందూ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బలిగొన్నారు. కాశ్మీర్ లోయలో తమకు భద్రత కరువైందని స్థానికేతర ఉద్యోగులు అందోళన చేందుతున్నారు. ఈ క్రమంలో వారు అందోళనలు కూడా చేపట్టారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని అవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు వీరు రాష్ట్రంలో వారి సేవలు అసరమైన చోట ఉండి విధులు నిర్వహించారని, కానీ ఇకపై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. కశ్మీరీ హిందు, మైనారిటీ కమ్యూనిటీ ఉద్యోగులందరినీ సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని ఎల్‌జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాల కేంద్రాలకు తరలించనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో తరలింపు ప్రక్రియ ఈ నెల 6 వరకు పూర్తి కానున్నది. అదే సమయంలో ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో భాగంగా ఈ-మెయిల్‌ ద్వారా సైతం ఫిర్యాదులు పంపొచ్చు. సత్వరం సకాలంలో సమస్యలను పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు హెచ్చరించారు. కశ్మీర్‌ లోయలో పీఎం ప్యాకేజీ, మైనారిటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఎల్‌జీ కఠిన ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యత ఆధారంగా తీసుకోనున్నారు. ఎల్‌జీ సెక్రటేరియట్ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఫిర్యాదుల పరిష్కారం కోసం సాధారణ పరిపాలన విభాగం ఫిర్యాదులు చేయగల ప్రత్యేక ఇ-మెయిల్ చిరునామాను జారీ చేస్తుంది. మైనారిటీ ఉద్యోగుల కోసం సెల్ ది కాశ్మీర్‌లోని మైనారిటీ ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది.

మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. లేదంటే 0194-2506111, 2506112 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు అధికారులు పరీక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. లోయలో ఉద్యోగుల భద్రత, వసతికి సంబంధించి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఉద్యోగులకు నివాసాలను సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా చూడనున్నారు. వసతికి ఇండ్లను కేటాయించే సమయంలో అక్కడ ఒకటే లేకుండా చూడనున్నారు. అలాగే ప్రధానమంత్రి ప్యాకేజీలో పని చేస్తున్న కశ్మీరీ పండిట్ల ప్రమోషన్‌, సీనియారిటీ జాబితా, డిపార్ట్‌మెంటర్‌ ప్రమోషన్స్‌ జాబితా మూడు వారాల్లో సిద్ధం కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles