Johnny Depp wins defamation lawsuit against ex-wife పరువునష్టం కేసులో మాజీ భార్యపై నటుడి గెలుపు

Johnny depp grabs a pint and fish and chips to celebrate trial victory

johnny depp, amber heard, ex-wife Amber Heard, Johnny Depp News, amber heard, Johnny Depp Defamation Lawsuit, johnny depp, ex-wife Amber Heard, Johnny Depp won a defamation suit, defamation suit, Johnny Depp, Amber Heard, Actor Johnny Depp, Hollywood actor Johnny Depp, Depp vs Heard, Defamation trial, Amber Heard vs Johnny Depp

Hollywood star Johnny Depp faced a high bar to win his libel lawsuit against his ex-wife Amber Heard. According to seven unanimous jurors, he cleared it. Depp said his ex-wife defamed him in a 2018 newspaper op-ed in which she alluded to abuse allegations against Depp. His name was never mentioned.

పరువునష్టం కేసులో మాజీ భార్యపై గెలిచిన హాలీవుడ్‌ న‌టుడు జానీ డెప్‌

Posted: 06/02/2022 07:52 PM IST
Johnny depp grabs a pint and fish and chips to celebrate trial victory

ప‌రువు న‌ష్టం కేసులో హాలీవుడ్‌ న‌టుడు జానీ డెప్‌కు న్యాయ‌ప‌ర‌మైన విజ‌యం ల‌భించింది. మాజీ భార్య అంబ‌ర్ హెర్డ్ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసులో వ‌ర్జీనియా కోర్టు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే ఆ కేసులో ఇద్ద‌రికీ న‌ష్ట‌ప‌రిహారం ద‌క్కేలా జ‌డ్జి తీర్పును వెలువ‌రించారు. డెప్‌కు 15 మిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించాల‌ని హెర్డ్‌కు కోర్టు ఆదేశించింది. ఇక హెర్డ్‌కు రెండు మిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించాల‌ని కూడా కోర్టు జానీ డెప్‌ను ఆదేశించింది. జానీ గృహ హింస వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు హెర్డ్ కేసును దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

2018లో వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాజీ భ‌ర్త డెప్‌పై హెర్డ్ గృహ హింస ఆరోప‌ణ‌లు చేసింది. త‌న ప‌రువు తీసింద‌న్న ఉద్దేశంతో హెర్డ్‌పై 50 మిలియ‌న్ల డాల‌ర్ల ప‌రువు న‌ష్టం కేసును డెప్ దాఖ‌లు చేశాడు. అయితే దానికి కౌంట‌ర్‌గా డెప్‌పై 100 మిలియ‌న్ల డాల‌ర్ల ప‌రువు న‌ష్టం కేసును హెర్డ్ వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ కేసులో విచార‌ణ సాగింది. ఏడుగురు స‌భ్యులు ఉన్న ధ‌ర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువ‌రించింది.

పైరేట్స్ ఆఫ్ ద క‌రేబియ‌న్ చిత్రంలో న‌టించిన జానీ డెప్‌, అంబ‌ర్ హెర్డ్‌లు 2011 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఆ ఇద్ద‌రూ 2105 ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత 15 నెల‌ల వ్య‌వ‌ధిలోనే న‌టి హెర్డ్‌ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. డెప్ త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు హెర్డ్ ఆరోపించింది. దీంతో ఒక‌రిపై ఒక‌రు ప‌ర‌వున‌ష్టం కేసుల్ని దాఖ‌లు చేసుకున్నారు. కెరీర్ నాశ‌నం కావ‌డానికి నువ్వే కార‌ణ‌మంటూ త‌మ త‌మ పిటిష‌న్ల‌లో ఆరోపించారు. ఈ కేసు వ‌ల్ల ఫెంటాస్టిక్ బీస్ట్స్ చిత్రం నుంచి జానీ డెప్ త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక అక్వామాన్ చిత్రం నుంచి కూడా హెర్డ్ త‌న పాత్ర‌ను త‌గ్గించుకోవాల్సి వ‌చ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles