Ramgopalpet CI Saidulu attached to commissionerate టకీలా పబ్ లో అశ్లీల నృత్యాలు.. సిఐ సైదులుపై సీపీ చర్యలు..

Tequila pub raid hyderabad cp serious on ramgopalpet ci s negligence

Hyderabad police commissionerate, Hyderabad CP, CV Anand, Hyderabad police Task Force, Ramgopalpet CI Saidulu transfered, CI Saidulu attached to commissionerate, Tequila Pub Raid, Tequila cafe and Bar late night pub, Hyderabad commissionerate, Tequila cafe and Bar, Ramgopalpet, Telangana, Crime

A day after the task force police had conducted a raid on Tequila Pub at Ramgopalpet, Police Commissioner Hyderabad CV Anand on Monday expressed his anguish over the alleged negligence of CI of Ramgopalpet police station and also issued orders attaching him to the CP office. The DI of Ramgopalpet was given Incharge duties.

టకీలా పబ్ లో అశ్లీల నృత్యాలు.. సిఐ సైదులుపై సీపీ చర్యలు..

Posted: 05/30/2022 01:40 PM IST
Tequila pub raid hyderabad cp serious on ramgopalpet ci s negligence

నగరంలోని కొందరు బడాబాబులు, సెలబ్రిటీలు వారాంతాల్లో బార్లు, పబ్లకు వెళ్లి అక్కడ లేట్ నైట్ పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే పక్క సమాచారంతో ఇలా అనుమతులు అతిక్రమించి లేట్ నైట్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్ లు బార్లపై పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పంజా విసురుతున్నారు. పబ్ నిర్వహకులతో పాటు సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి.. కటకటల్లోకి నెడుతున్నారు. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై లో మాదకద్రవ్యాలు వినియోగం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో దానిపై దాడి చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. రేవ్‌ పార్టీలు బహిర్గతం చేశారు. ఇక అప్పటి నుంచి నగరంలోని పబ్ లపై దృష్టి సారించారు.

తాజాగా రామ్‌గోపాల్‌పేటలోని క్లబ్‌ టెకీలపై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, జూబ్లీహిల్స్‌లోని ఎనిగ్మా పబ్‌పై స్థానిక  పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేయడంతో వీటి కేంద్రంగా జరుగుతున్న ‘డ్యాన్సుల’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన నగర పోలీసులు అన్ని క్లబ్బుల పైనా నిఘా ముమ్మరం చేశారు. పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనిబోమని పోలీసులు తేల్చిచెబుతున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా క్లబ్‌ టెకీల పేరుతో కేఫ్‌ అండ్‌ బార్‌ ఏర్పాటు చేసి పబ్‌గా మార్చేసినట్టు పోలీసులు దాడుల్లో బటభయలైంది.  

నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ బార్ డాన్సర్లుగా మార్చేశారు. ఇక వీరితో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ.. క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విజయ్‌ కుమార్‌ గౌడ్‌ కోసం గాలిస్తున్నారు. ఇక అనుమతులు లేకుండా పబ్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా. అసభ్యకర నృత్యాలపై నిర్లక్ష్యం వహించిన స్థానిక సిఐ సైదులుపై సీపీ సివి ఆనంద్ చర్యలు తీసుకున్నారు. ఆయనను కమీషనరేట్ కు అటాట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles