Ink thrown at farmer leader Rakesh Tikait in Bengaluru రైతు సంఘాల నేత రాఖేశ్ తికాయత్ పై ఇంకు దాడి.!

Black ink thrown at bku leader rakesh tikait in bengaluru 3 detained

farmer leader, Rakesh Tikait, Bhartiya Kisan Union leader, black ink thrown at rakesh tikait, ink thrown on rakesh tikait, bhartiya kisan union, Rakesh Tikait news, bengaluru, Karnataka, farmer leader, Crime

Farmer leader Rakesh Tikait was Monday attacked with ink during an event organised by a farmers’ organisation in Bengaluru. Following the incident, the police said they took three people in custody.

రైతు సంఘాల నేత రాఖేశ్ తికాయత్ పై ఇంకు దాడి.!

Posted: 05/30/2022 07:50 PM IST
Black ink thrown at bku leader rakesh tikait in bengaluru 3 detained

సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్​కు బెంగళూరులో పరాభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం కర్ణాటక రాజధాని బెంగళూరుకు విచ్చేసిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, అయనపై కొందరు దుండగులు ఇంకు(సిరా) దాడి చేశారు. నూతన వ్యవసాయ సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం మెడలు వంచి మొక్కవోని దీక్షతో ఉపసంహరించుకునేలా చేసిన నేతకు బెంగళూరులో ఈ విపత్కర పరిణామం ఎదురుకావడం గమనార్హం. ఈ పరిణామంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఈ క్రమంలో వెంటనే తేరుకున్న కార్యక్రమ నిర్వహకులు.. సిరా దాడి చేసినవారిని అడ్డుకున్నా అప్పటికే వారు ఆయన ముఖంపై సిరాను చల్లారు. దీంతో ఆగ్రహించిన నిర్వాహకులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు తిరగబడ్డారు. దీంతో వారిని కట్టడి చేయడానికి నిర్వాహకులు వారిపై చేయి చేసుకోవాల్సి  వచ్చింది. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత ఆయన తనపై సిరా దాడి జరగడం పట్ల తీవ్రంగా స్పందించారు. తన కార్యక్రమానికి పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కొందరితో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా చేసిందని ఆరోపించారు.

పోలీసుల అదుపులో ముగ్గురు: భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ తికాయిత్​పై సిరా దాడి ఘటనపై చర్యలు చేపట్టారు బెంగళూరులోని హైగ్రౌండ్స్ ఠాణా​ పోలీసులు. ఇంక్​ చల్లినట్లు భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్‌ డబ్బు తీసుకుంటూ మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్‌, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్‌ మద్ధతుదారులేనని టికాయత్‌ చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles