Model Shahana found dead in Kozhikode నటి షహానా అనుమానాస్పద మృతి.. పోలీసుల అదుపులో భర్త

Kerala model actor found dead at her residence husband taken into custody

Kerala model, Malayalam actor, Suspicious death, Kozhikode residence, husband Sajjad, Police custody, Kerala news, crime

A 20-year-old model-cum-actress was found dead at her residence near Kerala’s Kozhikode city. According to the police, Shahana was found hanging at their residence on Thursday night. Shahana’s husband, Sajjad (31), has been taken into custody for questioning.

కేరళ మోడల్, నటి షహానా అనుమానాస్పద మృతి.. పోలీసుల అదుపులో భర్త

Posted: 05/14/2022 04:46 PM IST
Kerala model actor found dead at her residence husband taken into custody

కేరళకు చెందిన మోడల్, మలయాళ చిత్రపరిశ్రమ నటి సహానా అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమె కోజికోడ్‌లోని తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. పిన్న వయస్సులోనే సెలబ్రిటీగా మారిన అమె.. ఇరవై ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయా.? అంటూ అభిమానులను విషాదంలో మునిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె భర్త సజ్జాద్‌ (31)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరంబిల్ బజార్‌లో ఉన్న తన నివాసంలో ఇరవై ఏళ్ల సహానా గురువారం రాత్రి విండో రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించింది.

సహానా మరణం చుట్టూ అనుమానాలు అల్లుకున్నాయి. అమెది హత్యా.? ఆత్మహత్యా.? అన్న కోణంలో పోలిసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, గురువారం సహానా 20వ బర్త్ డే అని, సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంటికి వస్తానని తమకు ఫోన్ చేసి చెప్పిందని సహానా తల్లి ఉవెయ్మా తెలిపారు. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా కనిపించిందని, ఆమె ఆత్మహత్య చేసుకుందని తాను ఆనుకోవడం లేదని అన్నారు. ఎంతో హుషారుగా మాట్లాడిన తన బిడ్డ.. అంతలోనే విగతజీవిగా మారిందంటే నమ్మశక్యం కావడం లేదని కన్నీటి సంద్రంలో మునిగారు.

తన కుమార్తెను ఆమె భర్త సజ్జాదే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ఓ ప్రకటన(యాడ్) కోసం అందుకున్న చెక్‌ను తనకు ఇవ్వకపోతే చంపేస్తానని సహానాను ఆమె భర్త బెదిరించాడని పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం కోజికోడ్‌కు చెందిన సజ్జాద్‌తో సహానాకు వివాహమైంది. ఆ సమయంలో అతడు ఖతార్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన తర్వాతే సహానా మోడలింగ్‌లోకి వెళ్లిందని, తమిళ సినిమాల్లోనూ నటించిందని ఉవెయ్మా తెలిపారు. సహానా బాగా సంపాదిస్తుండడంతో సజ్జాద్ తిరిగి ఖతార్ వెళ్లేందుకు నిరాకరించాడని పేర్కొన్నారు. సహానా సంపాదించిన డబ్బును ఖర్చు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని ఆరోపించారు.

పెళ్లయిన తర్వాత సహానాకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. సజ్జాద్ కూడా ఆమెను వేధించేవాడని తెలిపారు. తల్లి ఉవెయ్మా పిర్యాదు మేరకు సహానా మరణం తర్వాత సజ్జాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా, చెక్కు విషయంలో సహానా-సజ్జాద్ మధ్య గొడవ జరిగినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. సజ్జాద్ మాత్రం ఆమె తనంత తానే ఉరివేసుకుని మరణించినట్టు చెబుతున్నాడని పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles