త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామాను త్రిపుర గవర్నర్ ఎస్.ఎన్. ఆర్యకు సమర్పించారు. మరో ఆరు నెలల్లో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే త్రిపురలో పాగావేసేందుకు ఓ వైపు పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణముల్ కాంగ్రెస్ కూడా బలంగానే పావులు కదుపుతోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభినవ్ ముఖర్జీ నేతృత్వంలో త్రిపురలో తృణముల్ కాంగ్రెస్ లోకి వలసలు ఇప్పటికే ఓ స్థాయికి చేరుకున్నాయి.
ఇక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అపరేషన్ అకర్ష్ కు తృణములు ఫదను పెట్టాలని యోచిస్తోంది. ఇంతటి కీలక పరిస్థితుల్లో సీఎం విప్లవ్ దేవ్‌ను తప్పించి, బీజేపీ కొత్త రాజకీయ పరిణామానికి దారి తీసింది. అయితే.. శనివారం సాయంత్రమే బీజేపీ అధిష్ఠానం కొత్త సీఎంను ప్రకటించనుంది. అయితే మరో వాదన కూడా ఉంది. డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జిష్ణుదేవ్ వర్మను ఆపద్ధర్మ సీఎంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తను బీజేపీ అధికారికంగా ధ్రువీకరించడం లేదు.
మరోవైపు నూతన సీఎంగా ఎవర్ని ప్రకటించాలన్న సందిగ్ధంలో బీజేపీ పడిపోయింది. శనివారం సాయంత్రం బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానుంది. 2018 లో విప్లవ్ దేవ్ త్రిపుర సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన కార్య పద్ధతి ఇతర నేతలకు, కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో బీజేపీలో ఓ రకమైన ఉక్కపోత, తిరుగుబాటు ధోరణి తయారైంది. అధిష్ఠానం కూడా విప్లవ్ దేవ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ సమయంలో విప్లవ్ దేవ్ సీఎంగా కొనసాగితే ఇబ్బందలుకున్న బీజేపీ… సింపుల్‌గా ఆయన్ను పదవి నుంచి తప్పించింది.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more