Cyclone Asani weakens as it approaches Andhra coast బలహీనపడిన అసని.. తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారి..

Cyclone asani severe storm weakens to cyclone possible landfall near machilipatnam

Cyclone Asani, Cyclonic storm Asani, Cyclone Asani News, Cyclone Asani News Today, Cyclone Asani Latest News, Andhar Pradesh News, Asani Cyclone News, jaipur,kakinada,jena,chennai,odisha,andhra pradesh,mumbai,pradeep kumar jena,visakhapatnam,cyclone asani updates,cyclon,cyclone asani live tracker,cyclone asani latest,cyclone asani

Severe Cyclone Asani weakened to a cyclonic storm on Wednesday as it barrelled towards north coastal Andhra Pradesh and came within 34 km of Narsapur in the state, packing wind speed of 85 km per hour and bringing heavy rains to the region, the weather office said here.

బలహీనపడిన అసని.. తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారి..

Posted: 05/11/2022 11:29 AM IST
Cyclone asani severe storm weakens to cyclone possible landfall near machilipatnam

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను ‘అసని’ క్రమంగా తుపాను బలహీనపడింది. ఇది మరింత బలహీనపడి రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ., కాకినాడకు 150 కి.మీ, విశాఖకు 310 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. దిశ మార్చుకుని పశ్చిమవాయవ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

అసని తుపాను తీరానికి అతిదగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో గంటకు 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసని తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలుజిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అసని తుపాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే నేడు పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- నర్పాపురం, నిడదవోలు, భీమవరం జంక్షన్‌, కాకినాడ పోర్ట్‌, విజయవాడ సహా మరికొన్ని రైళ్లను బుధవారం రద్దు చేసింది. అదే విధంగా అసని తుపాన్‌ ఎఫెక్ట్‌ విమాన సర్వీసులపై కూడా పడింది.విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles