Railways introduces Baby Berth on a trial basis రైల్వేలో నవజాత శిశువులకు ‘బేబీ బెర్త్‌’ అందుబాటులోకి..!

Northern railways introduces baby berth on a trial basis in few trains

Indian Railways, Indian Railways launch baby berth, Baby berth launched, Northern Railways, Indian Railways, Netizens, internet, Social media, mothers day gift, Railways introduces baby berths in select trains, new baby berth, Indian Railways introduces Baby Berth, Northern Railway, Northern Railway zone, beneficial for women passengers, Indian Railways introduces foldable baby berths

The Indian Railways introduced a separate 'Baby Berth' (seats for newly-born children) in trains on Mothers's Day on February 8 where the infants will now be able to sleep alongside their mother. The lower berths already reserved for women have been placed next to baby berths so that young children can travel with their mother without any inconvenience.

రైల్వే మదర్స్‌ డే గిఫ్ట్‌.. నవజాత శిశువులకు ‘బేబీ బెర్త్‌’ అందుబాటులోకి..!

Posted: 05/10/2022 08:21 PM IST
Northern railways introduces baby berth on a trial basis in few trains

రైలు ప్రయాణం చేసే అమ్మలకు రైల్వోశాఖ మధర్స్ డే సందర్బాన్ని పురస్కరించుకుని ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. అమ్మలు తమ చిన్నారి శిశువులతో కలసి రైలు ప్రయాణం చేసేప్పుడు వారికి కానీ లేక శిశువులకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా కొత్తగా ‘బేబీ బెర్త్‌’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై శిశివులు కలిగిన తల్లులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటినిండా నిద్రపోయేలా చేస్తోంది. తమ శిశివులను పక్కనే పడుకోబెట్టుకునే వీలుకలుగజేస్తోంది. ఇప్పటినుంచి రైలులో ప్రయాణించే తల్లుల కోసం ప్రత్యేకంగా ఇలాంటి సౌకర్యం అందుబాటులో రానుంది. అయితే పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతోంది.

ఈ క్రమంలోనే రైల్వేశాఖ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లక్నో – ఢిల్లీ మార్గంలో నడిచే లక్నో మెయిల్‌లో రెండు బెర్తులను ఏర్పాటు చేశారు. అయితే, బేబీ బెర్త్‌ కోసం ప్రత్యేకంగా రైల్వే ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. కొత్త సదుపాయం ప్రవేశపెట్టిన తర్వాత పాలు తాగే శిశువులతో ప్రయాణించే మహిళలు సాఫీగా ప్రయాణం చేస్తారని రైల్వేశాఖ ట్వీట్‌ చేసింది. లక్నో మెయిల్‌లోని త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రెండు బెర్త్‌లతో పాటు బేబీ బెర్త్‌ను ప్రవేశపెట్టినట్లు రైల్వేశాఖ ట్వీట్‌లో ‘బేబీ బెర్త్‌’ ఫొటోను షేర్‌ చేసింది.

త్వరలోనే బేబీ బెర్త్‌ సదుపాయాన్ని ఇతర రైళ్లలోను వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా లక్నో డివిజన్‌ డివిజనల్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ అతుల్‌ సింగ్‌ మాట్లాడుతూ బేబీ బెర్త్‌ను రైలు లోయర్‌ బెర్త్‌లో ఏర్పాటు చేశామని, అవసరం లేని సమయంలో బెర్త్‌ను కిందికి మడతపెట్టవచ్చని పేర్కొన్నారు. బెర్త్‌ను ఏర్పాటు చేసుకోవడం సులభమని చెప్పారు. 770 మిల్లీమీటర్ల పొడవు, 255 మిల్లీమీటర్ల వెడల్పు, 76.2 మిల్లీమీటర్ల ఎత్తు ఉండే.. ఈ బేబీ బెర్త్‌కు.. బెర్త్‌పైనున్న శిశువు సురక్షితంగా ఉండేలా పట్టీలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles