TRS activists attack Praja Shanthi Party chief K A Paul ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి..

Trs activists attack praja shanthi party chief k a paul at siddipet

TRS activists attacked Praja Shanthi Party president, TRS activists attacked K A Paul, K.A. Paul attacked at Jakkapur village, K.A. Paul attacked at siddipet village, Praja shanti party, K A Paul, TRS Activist, Jakkapur, Siddipet, Farmers, Slap, sircilla police, Telangana, Politics

In a shocking incident, some Telangana Rashtra Samithi (TRS) activists attacked Praja Shanthi Party founder president K.A. Paul at Jakkapur village bordering Siddipet and Sircilla districts on Monday. The incident took place in the presence of police.

ITEMVIDEOS: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి..

Posted: 05/02/2022 09:52 PM IST
Trs activists attack praja shanthi party chief k a paul at siddipet

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ కార్యకర్త ఆయనపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ కార్యకర్త ఆయన చెంప చెళ్లుమనిపించాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన కేఏ పాల్.. వారిని పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు., సిద్దపేట జిల్లా దాటి సిరిసిల్ల జిల్లాలోనికి వెళుతుండగా, సిద్ధిపేట జిల్లా సరిహద్దులో జక్కాపూర్ వద్ద ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు.

దీంతో వాహనం దిగిన కేఏ పాల్ వారితో మాట్లాడి శాంతిపర్చేందుకు ప్రయత్నిస్తుండగా, వారిలో ఓ వ్యక్తి కేఏ పాల్ పై ఆకస్మికంగా దాడి చేశాడు. ఊహించని పరిణామంతో పాల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, కేఎల్ పాల్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తిని జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనపై దాడి జరిగిన నేపథ్యంలో కేఏ పాల్ పోలీసులపై మండిపడ్డారు. మీరు పోలీసులా? టీఆర్ఎస్ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తోందా? అంటూ ప్రశ్నించారు. రైతులను అటు మోదీ గానీ, ఇటు కేసీఆర్ గానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

రైతుల కోసమే తాను వచ్చానని, తాను వస్తానని చెబితే వచ్చి తీరతానని కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. స్థానిక డీఎస్పీ నిరసనకారులను పాల్ కారుకు అడ్డుకునే ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయాల్సిందిపోయి.. తాపీగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. రాజకీయ పార్టీకి చెందిన అధ్యక్షుడు పర్యటనలో నిరసనకారులు ఎదురుకాగా, ముందస్తు చర్యల్లో భాగంగా వారిని ముందుగానే అక్కడి నుంచి పంపించాల్సిన పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దాడి జరిగిందన్న విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles