AP High Court Comments on Bigg Boss And Reality Shows బిగ్ బాస్ రియాల్టీ షోపై ఘాటుగా స్పందించిన హైకోర్టు..

Andhra pradesh high court high court comments on bigg boss and reality shows

High Court harsh comments on Bigg Boss show, Bigg Boss reality show promotes obscenity, Bigg Boss reality show promotes vulgarity, High Court lauded the petitioner for good pill, Justice Asanuddin Amanullah,Justice T. Rajasekhara Rao, need to intervene objectionable shows, Bigg boss, Reality Show, Vulgarity, obscenity, objectionable shows, PiL, petitioner, High Court, harsh comments, Andhra Pradesh, Crime

The Andhra Pradesh High Court questioned whether there was anything other than violence and obscenity in reality shows like Bigg Boss. The High Court taking a serious note said that they would not keep their eyes closed for whatever it takes over such shows, we all know what is being shown in these programmes, the Court commented.

బిగ్ బాస్ షోపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. సీజే బెంచ్ విచారణకు అవకాశం..

Posted: 05/03/2022 12:00 PM IST
Andhra pradesh high court high court comments on bigg boss and reality shows

బిగ్‌బాస్‌ రియల్టీ షోలో హింసాత్మక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ వాటినే సంస్కృతి సంప్రదాయాలు.. వ్యక్తిత్వ వికాసం అని చెబితే సహించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ సహా పలు రియాలిటీ షోలపై ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన పిటీషనర్ కు మరోమారు ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ కోరే అవకాశాన్ని కల్పించింది. బిగ్‌బాస్‌ టీవీ షోలో అశ్లీలం, అసభ్యత ఎక్కువయ్యాయంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

బిగ్ బాస్ రియాల్టీ షో అసభ్యకరమైన మరియు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేసి యువతను చెడగొడుతుందని వాదిస్తూ పిటీషనర్ కే జగదీశ్వర్ రెడ్డి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జి శివప్రసాద్‌రెడ్డి కోరారు. ఇలాంటి షోల పేరుతో ఏదైనా, ప్రతిదాన్ని ప్రదర్శించడం, హింసను ప్రోత్సహించడం మన సంస్కృతిలో భాగమని భావించలేమని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరడంతో జస్టిస్ అసదుద్దీన్ అమనుల్లా, జస్టిస్ ఎస్‌.సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సరైన కారణం కోసమే పిటిషన్ దాఖలు చేశారని, రియాల్టీ షో పేరుతో ఏమి చేసినా చెల్లుతుందనుకోవద్దని హైకోర్టు హెచ్చరించింది. అదే సమయంలో కేతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ కోసం పది రోజుల క్రితం సీజే ధర్మాసనాన్ని కోరారని, వారు అనుమతించలేదని సీనియర్లు కోర్టుకు తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ విచారణకు స్వీకరించకపోవడంతో ఇన్‌ఛార్జి కోర్టు ముందు విచారణ కోరినట్లు పిటిషనర్‌ తరపు న్యాయవాది వివరించారు.

ఇన్‌ఛార్జి కోర్టులో విచారణ కోరే హక్కు తమకు ఉందని చెప్పడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సీజే నిరాకరించిన విషయాన్ని తమకు ముందే చెప్పి ఉండాల్సిందన్నారు. మరోమారు సీజే బెంచ్‌ను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు అనుమతించింది. కాగా, బిగ్ బాస్ షోపై ఇదివరకే సీపీఐ నాయకుడు నారాయణ ఘాటుగా వ్యాఖ్యాలు చేశారు. అది బిగ్ బాస్ హౌజ్ కాదని.. బ్రోతల్ హౌజ్ అని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అతనిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని బిగ్ బాస్ హౌజ్ నిర్వాహకులు హెచ్చరించారని, అయితే అందుకు తాను కూడా సిద్దమేనని తేల్చిచప్పానని ఒక సందర్భంలో నారాయణ చెప్పిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles