Woman cooks roti on the car’s bonnet చండ్ర నిప్పులు: కారు బ్యానెట్ పై చపాతి చేసిన మహిళ

Watch woman cooks chapati on car bonnet as temperatures soar in odisha

india heat, roti on car bonnet, woman makes roti on car, IMD, heat waves, Indian summer temperature, India, Odisha, Sonepur, heat wave, india summers, india heat wave, odisha heat wave, odisha weather, odisha summer, viral video, Trending

India is witnessing the 'hottest summer ever'. Many parts of the country is currently covered with severe heatwave with temperatures rising to high as 45 degrees Celsius every day. To prove that heat in Odisha has reached its peak, a woman in Odisha’s Sonepur was captured on camera making roti on the car bonnet. A video has gone viral showing the woman making chapati on the hood of a car in the sizzling 40-degree heat.

ITEMVIDEOS: చండ్ర నిప్పులు: కారు బ్యానెట్ పై చపాతి చేసిన మహిళ

Posted: 04/28/2022 05:05 PM IST
Watch woman cooks chapati on car bonnet as temperatures soar in odisha

దేశంలో ఎండలు భగ్గుమంటున్నారు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో వడగాలులు సైతం విరుచుకుపడుతున్నాయి. ఇంకా మే నెల మొదలు కాకుండానే.. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45డిగ్రీలు దాటిపోయాయి. తెలంగాణలోని అదిలాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఒడిశాలోనూ ఎండలు దడదడలాడిస్తున్నాయి. దీనికి తోడు ఒడిశాలో వడగాల్పులు రాష్ట్రప్రజలను బయటకు రానీయకకుండా కట్టడి చేస్తున్నాయి. ఒడిశాలో హీట్​వేవ్​ కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో మరికొన్ని రోజులు పాటు ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో ఉంటాయని అంచనావేసింది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. 25నుంచి ఐదురోజుల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కటక్​, ఖుర్దా, ఆంగూల్​, సబర్నపూర్​, బౌద్​, నయాగర్​ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ప్రచండభానుడి తాపానికి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పే విధంగా తాజాగా.. ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.

ఓ మహిళ.. స్టవ్​ లేకుండానే, మండుటెండలో నిలిపిన కారు బానెట్​పై చపాతీలు చేసేసింది! ఒడిశా సోనిపూర్​ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిలా మధబ్​ పాండే అనే ఓ సినీ నిర్మాత.. ఈ నెల 25న ఈ వీడియోను ట్వీట్​ చేశారు. 'నా సోనిపూర్​లోని దృశ్యాలు ఇవి. ఎండలు ఎలా ఉన్నాయంటే.. కారు బానెట్​పై చపాతీలు చేసేయవచ్చు,' అని క్యాప్షన్​ ఇచ్చారు. వీడియోలో.. ఓ కారు కనిపిస్తుంది. ఇద్దరు మహిళలు కారు వద్ద నిలబడి ఉన్నారు. ఓ మహిళ.. పిండి తీసుకుని చపాతీలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత.. దానిని కారు బానెట్​పై పెట్టింది.

స్టవ్​ మీద చేసే విధంగానే గరిట పట్టుకుని చపాతీని కిందికి, పైకి తిప్పింది. కొన్ని నిమిషాల తర్వాత.. చపాతీ తయారైపోవడం గమనార్హం. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆ దృశ్యాలను చూసి షాక్​ అవుతున్నారు. 'వామ్మో ఎండలు', 'బయటకు వెళ్లకండి బాబోయ్​' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికోందరు మాత్రం గతంలో కొడిగుడ్లు అమ్లేటు అయ్యేవి.. కానీ ఇప్పుడు ఏకంగా చపాతీలే తయారవుతున్నాయ్.. ఇక మున్ముందు ఏమవుతుందో అంటూ అందోళన వ్యక్తం చేశారు. ఇక కొందరు మాత్రం ఏసీలకు అయ్యే బిల్లును గ్యాస్ రూపంలో పోదుపు చేస్తున్నారా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh