Patnam Mahender Reddy Slams Tandur CI తాండూరు సిఐకి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వార్నింగ్

In viral clip trs mlc patnam mahender reddy abuses threatens circle inspector

Tandur CI, Rajender Reddy, MLC Mahender Reddy, Tandur MLA, Rohit Reddy, TRS, internal clashes, Sand Mafia, Rowdy Sheeters, Carpet, Verbal abuse, Tandur constituency, Vikarabad, Telangana, Politics, Crime

In an audio clip that has gone viral, a voice, purported to be that of TRS MLC and former minister Patnam Mahender Reddy, is heard abusing the Circle Inspector Rajender Reddy of Tandur town, in Vikarabad district. The MLC can be heard abusing the CI in filthy language, using several cuss words.

ITEMVIDEOS: ‘‘ఒరేయ్ నీ అంతు చూస్తా’’: తాండూరు సిఐకి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వార్నింగ్

Posted: 04/28/2022 04:08 PM IST
In viral clip trs mlc patnam mahender reddy abuses threatens circle inspector

తాండురు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్యా రాజుకున్న రాజీకీయ వివాదం.. ఎట్టకేలకు తాండూరు సిఐ రాజేందర్ రెడ్డి మెడకు చుట్టుకుంది. విపక్షాల నేతలను ఇన్నాళ్లు కట్టడి చేయడంలో సఫలమైన తాండూరు పోలీసులకు గడిచిన రెండుమూడేళ్లుగా అధికార పార్టీలోని రెండు వర్గలను కట్టడి చేయడంలో ఎక్కడ ఇరుక్కుపోతామోనన్న భయం ఇప్పుడు నిజమైంది. సీనియర్ రాజీకీయ నేత, రాష్ట్ర మాజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రాజకీయ నేత.. చివరకు పట్టణ సిఐకి వార్నింగ్ ఇచ్చి.. బండబూతులు తిట్టి.. తనపైనే పోలీసులు కేసు నమోదు చేసుకునే పరిస్థితికి దిగజారారు.

‘రౌడీషీటర్లకు కార్పెట్‌ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. 3 రోజుల క్రితం జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్‌ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్‌ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్‌ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు.

‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసు క అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నాన ని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్‌ కట్‌ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్‌ ఎస్పీ తెలిపారు. జాతర సందర్భంగా జరిగిన తప్పిదాలు పోలీసు ఉన్నతాధికారులకు సమస్యలను తెచ్చిపెట్టాయి.

జాతర నేపథ్యంలో ఎమ్మెల్సీ, సీఐకి ఫోన్ చేసి తిట్లపురాణం అందుకున్న ఆడియో బయటకు రావడం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డిని వివరణ కోరగా, ‘పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ప్రొటోకాల్‌ను పాటించట్లేదు. అయితే బయటకి వచ్చిన ఆడియో రికార్డు తనది కాదని స్పష్టం చేశారు. సీఐతో బూతులు మాట్లాడలేదని తెలిపారు. సిఐ రాజేందర్ రెడ్డిని వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా, తాండూరు సీఐని మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు  గోపిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ క్షమా పణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tandur CI  Rajender Reddy  MLC Mahender Reddy  TRS  Rowdy Sheeters  Carpet  Verbal abuse  Vikarabad  Telangana  Politics  

Other Articles