Taiwan TV apologises over Chinese war blunder తైవాన్ టీవీ తప్పుడు వార్త.. ఆనక క్షమాపణలు

Taiwan news channel accidentally airs false report of chinese invasion

Taiwanese news channel, fictional news, Chinese armed forces, China troops invasion, China missiles, Taipei, Taiwan, China, Asia Pacific, World news

A Taiwanese news channel has broadcast by mistake a fictional news alert that said Chinese armed forces had launched an invasion, firing missiles at cities and ports surrounding the capital, Taipei. Several news captions declaring a violent attack by China’s People’s Liberation Army had been mocked up for forthcoming security drills, but were broadcast accidentally. A Taiwanese television station apologised for "causing public panic" after erroneously running a series of alerts saying that China had launched attacks on the island.

తైవాన్ టీవీ తప్పుడు వార్త.. ఆందోళన గురైన ప్రజలు.. ఆనక క్షమాపణలు

Posted: 04/20/2022 03:43 PM IST
Taiwan news channel accidentally airs false report of chinese invasion

తైవాన్, చైనా మధ్య ఇటీవల పరిణామాల క్రమంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తరచుగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తైవాన్ అప్రతమత్తంగా ఉంటోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు జరుపుతున్న క్రమంలో, చైనా కూడా ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తుందేమోనని తైవాన్ ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. కాగా, తైవాన్ ప్రభుత్వ టీవీ చానల్ అప్రమత్తత విషయంలో కాస్త మోతాదు మించి వ్యవహరించింది. ఒకవేళ చైనాతో యుద్ధమే సంభవిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఏంచేయాలో అగ్నిమాపక శాఖతో కలిసి సదరు టీవీ చానల్ మాక్ డ్రిల్ చేపట్టింది.

అయితే, మాక్ డ్రిల్ సందర్భంగా రూపొందించిన ఉత్తుత్తి యుద్ధం వార్తలు టీవీ చానల్లో నిజంగానే ప్రసారం అయ్యాయి. ఉదయాన్నే నిద్రలేచి టీవీ చూసిన తైవాన్ ప్రజలు ఆ వార్తలు చూసి తీవ్రఆందోళనకు గురయ్యారు. తైవాన్ పై చైనా దాడి చేసిందని, రాజధాని నగరం తైపీకి సమీపంలో కొన్ని యుద్ధనౌకలు, ఇతర వ్యవస్థలపై చైనా మిస్సైల్ దాడులు చేసిందని తైవాన్ ప్రభుత్వ టీవీ చానల్ పేర్కొంది. అంతేకాదు, తైపీకి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ను చైనా ఏజెంట్లు అగ్నికి ఆహుతి చేశారని వెల్లడించింది. యుద్ధం వచ్చే పరిస్థితులు ఉండడంతో తైవాన్ అధ్యక్షురాలు దేశంలో ఎమర్జెన్సీ విధించారని ప్రభుత్వ చానల్ వివరించింది.

అసలే చైనా వైఖరి పట్ల ఎన్నో అనుమానాలున్న తైవాన్ ప్రజలు... తాజా ప్రకటనలో వణికిపోయారు. చైనా నిజంగానే యుద్ధానికి దిగిందేమోనని హడలిపోయారు. అయితే, ప్రభుత్వ టీవీ చానల్ కాసేపటికే తన తప్పిదాన్ని గుర్తించింది. వెంటనే సవరణ ప్రకటన చేసింది. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, అగ్నిమాపకశాఖతో మాక్ డ్రిల్ సందర్భంగా రూపొందించిన వార్తలు పొరబాటున లైవ్ లో ప్రసారం అయ్యాయని వివరణ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని, దేశ ప్రజలు క్షమించాలని కోరింది. కాగా, తమ వివరణ పట్ల తైవాన్ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని కూడా ఆ చానల్ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles