Janasena demands Rs 7 lakh ex gratia to kin of deceased farmer familes ‘‘సీబిఐ దత్తపుత్రుడు.. చర్లపల్లి షెటిల్ టీమ్..’’ అని అనగలం: పవన్ కల్యాణ్

I can also call you as cbi adopted son and charlapally shuttle team pawan kalyan warns ycp

Pawan Kalyan, Janasena Party (JSP), Koulu Rythula Bharosa Yatra, tenant farmers suicides, CBI Adopted son, Charlapally Shuttle team, Chandrababu dattaputrudu, TDP B team, Kothacheruvu, Dharmavaram, Raptadu mandal, Ex gratia, Anantapur, Andhra Pradesh, Politics

Jana Sena Party (JSP) supremo Pawan Kalyan's 7-hour blitzkreig dubbed as ' Koulu Rythula Bharosa Yatra' which took him to Kothacheruvu and Dharmavaram in Sathya Sai district and Pulakuntla and Mannela villages in Raptadu mandal in the district and he spent time with a few bereaved families of tenant farmers who committed suicide in the recent past.

‘‘సీబిఐ దత్తపుత్రుడు.. చర్లపల్లి షెటిల్ టీమ్..’’ అని అనగలం: పవన్ కల్యాణ్

Posted: 04/13/2022 11:51 AM IST
I can also call you as cbi adopted son and charlapally shuttle team pawan kalyan warns ycp

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు కూడా తన వైరి పార్టీల నేతలను విమర్శించడం తెలుసునని, అయితే వ్యక్తిగత దూషణలకు తాను పాల్పడకూడదని.. ఈ తరహా దూషణలతో రాష్ట్రంలోని అసలు సమస్యలు పక్కకుపోయి.. దూషణ,భూషణ అంశాలే హైలైట్ అవుతాయని తెలుసునన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సాయం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. తరచూ తనపై టీడీపీతో జట్టు కట్టి విమర్శించడంపై పవన్ మండిపడ్డారు.

జనసేనను టీడీపీ-బీ టీమ్ అంటే వారిని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అంటానని హెచ్చరించారు. 16 నెలలు జైలులో కూర్చుని షటిల్‌ ఆడటం వాస్తవమో కాదో చెప్పాలని సీఎం జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తాను ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటే.. వైసీపీ అగ్రనేతలు వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ విదేశాల్లో చదువుకోలేదని తనది లండన్‌ రాయల్‌ ఫ్యామిలీ అసలే కాదని, ప్రకాశంజిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన వాడినన్నారు. వైసీపీ నేతలు తిట్టే భాషకంటే మంచి భాషే తనకు వచ్చని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం ఇష్టంలేకే ఆ భాష వాడటం లేదన్నారు.

‘మీరేమైనా సుభా్‌షచంద్రబోస్‌, సర్దార్‌ పటేల్‌ మాదిరిగా దేశసేవ చేసి జైలుకెళ్లారా..?’ అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైలులో కూర్చొని వచ్చింది వాస్తవం కాదా అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ‘‘బాధిత రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక ప్రభుత్వానికి లేదన్నారు. ఎంతమంది రైతులు ఎందరు చనిపోయారనే లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదన్నారు. ఏడాదిన్నర క్రితం ఆత్మహత్యలు చేసుకున్నరైతు కుటుంబాలకు తాను వస్తున్నానని తెలిసి, ఆయా కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశారని విమర్శించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 170 మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్య పాల్పడ్డారని, వారందరికీ ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. . ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.ఏడు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆర్థికసాయంతో పాటు వారి పిల్లల చదువు బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. ఇందుకోసం సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంక్షేమ నిధికి తనవంతుగా సగభాగం నిధులు ఇస్తానని, మిగిలిన సగం నిధులు ఇచ్చేందుకు తమ పార్టీ నాయకులు ముందుకు వచ్చారన్నారు.

రైతు భరోసా కార్యక్రమంలో పలువురికి పవన్ ఆర్ధిక సాయం అందించారు.  మొదట కౌలు రైతు భార్య సాకే సుజాతను పరామర్శించారు. ఆ తర్వాత ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య చంద్రకళకు అందజేశారు. ఆ తర్వాత ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో నిట్టూరు బాబు కుటుంబానికి , బత్తలపల్లి గ్రామంలో కలుగురి రామకృష్ణ కుటుంబ సభ్యులకు, అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు.మరో 26 కౌలు రైతు కుటుంబాలకు మన్నీల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రూ.లక్ష చొప్పున చెక్కులు అందచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh