Congress seeks Governor’s intervention against KCR's 'erratic governance' సీఎం కేసీఆర్ పూటకో నిర్ణయం.. రైతులకు శాపం: టీపీసీసీ రేవంత్ రెడ్డి

Congress doesn t trust kcr will continue agitation until last grain of paddy is procured revanth reddy

Governor, Tamilisai Soundararajan, Intervention, congress, Revanth Reddy, TPCC, K Chandrasekhar Rao, Paddy procurement, Loss, Farmers, distressed prices, erratic governance, irrational decisions, farmers’ sufferings, middlemen and millers, Telangana, Politics

Seeking Governor Tamilisai Soundararajan’s intervention against ‘erratic governance’ of Chief Minister K Chandrasekhar Rao, the Congress leader led by PCC chief, A Revanth Reddy met her at Raj Bhavan. They held that the delayed decision of paddy procurement has cost massive losses to farmers, most of whom have already sold away their produce at ‘distressed prices’ to private players.

కేసీఆర్ అస్తవ్యస్థ పాలనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: టీపీసీసీ

Posted: 04/13/2022 01:39 PM IST
Congress doesn t trust kcr will continue agitation until last grain of paddy is procured revanth reddy

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. రైతుల సమస్యలు, ప్రభుత్వ అవకతవకలపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. సర్కార్​ అవలంభిస్తోన్న వైఖరి, రైతుల ఇబ్బందులతో పాటు పలు అంశాలపై గవర్నర్​తో నేతలు చర్చించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అస్తవ్యస్థ పాలనపై గవర్నర్ తమిళసై జోక్యం చేసుకుని రాష్ట్ర గమనాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలని కోరారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులను ఎదర్కోంటోందని ఆయన అవేదన వ్యక్తం

ఢిల్లీలో దీక్ష పేరుతో డ్రామా చేసిన టీఆర్ఎస్ ను తిరిగి తెలంగాణ గడ్డకు రప్పించింది కాంగ్రెస్ పార్టేయేనని అన్న ఆయన.. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ నేపథ్యంలోనే ఒత్తిడికి తలొగ్గే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. వరి సేకరణ ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు భారీగా నష్టపోయారని, వీరిలో చాలా మంది ఇప్పటికే తమ ఉత్పత్తులను ‘బాధతో కూడిన ధరలకు’ ప్రైవేట్‌ కంపెనీలకు విక్రయించారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యలు, ప్రభుత్వ అవకతవకలపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలపై పూర్తి వివరాలతో గవర్నర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని.. ఇప్పటికే 30 శాతం వరి ధాన్యం దళారులు, మిల్లర్ల చేతిలోకి వెళ్లిందని తెలిపారు. రైతుల వద్ద మిల్లర్లు అత్యంత తక్కువగా క్వింటాలు రూ.1,300కే కొనుగోలు చేశారు. తక్కువ ధరకు బియ్యం అమ్మడం వల్ల రైతులకు రూ.2 నుంచి 3 వేల కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం.. క్వింటా ధాన్యంపై రూ.600 బోనస్‌ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

మిల్లర్లకు, దళారులు తోడై రైతులకు బియ్యాన్ని కారుచౌకగా బుక్కేశారని అరోపించారు. ఆయా రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇక రూ.2,600 కోట్ల విలువైన 8.34 లక్షల టన్నుల బియ్యం మాయమయ్యిందని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజ కొనే వరకు పోరాడుతామని కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. రైతులకు రూ.1960 ఇచ్చినా గిట్టుబాటు కాదని.. కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ రూపొందించి.. నాలుగు రోజుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. భేటీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్‌, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మధు యాష్కీ గౌడ్​, పొన్నం ప్రభాకర్​, బలరాం నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles