China battles worst Covid-19 outbreak in 2 years చైనాలో కొత్త కరోనా వేరియంట్.. అత్యంత వేగంగా విస్తరణ

Millions locked down as china see highest daily spike in covid in 2 years

COVID-19, Omicron, COVID-19 pandemic in china, COVID-19 pandemic in Changchun, COVID-19 pandemic in Shenzhen city, SARS-CoV-2 Omicron variant, Omicron, SARS-CoV-2, COVID-19 pandemic in Chinas Shenzhen city, COVID-19 pandemic in Jilin city, COVID-19 pandemic in China Jilin city, omicron symptoms, symptoms of omicron, Symptoms of omicron virus, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid newvariant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, covid news, corona updates

As most countries across the world open up and resume ‘normal life’ with a fall in Covid-19 cases, China is currently seeing its worst outbreak of the virus in two years. The country reported 3,100 new locally transmitted cases in a single day, which is the highest in two years. Some local authorities have attributed the surge in cases to the Omicron variant.

చైనాలో కొత్త కరోనా వేరియంట్.. అత్యంత వేగంగా విస్తరణ

Posted: 03/14/2022 11:45 AM IST
Millions locked down as china see highest daily spike in covid in 2 years

గత రెండేళ్లుగా ప్రపంచదేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్ల కాలంలో ఏకంగా 80లక్షల మందిని పోట్టనబెట్టుకుంది. ఈ సంఖ్యకు మించిన స్థాయిలోనే మరణాలు నమోదయ్యాయన్న అనుమానాలు నెలకొన్నాయి. గత రెండేళ్ల క్రితం చైనాలోని వూహాన్ సిటీనలో వెలుగుచూసినఈ మహమ్మారి ప్రపంచ గమనాన్ని మార్చివేసిన విషయం తెలిసిందే. దీని ప్రభావాన పడిన పలు దేశాలు మూడు, నాలుగు కరోనా దశలు కూడా ఎదుర్కోన్నాయి. అయినా ఇప్పటికీ ఇంకా ప్ర‌పంచాన్ని తన వేరియంట్లతో కోవిడ్ అత‌లాకుత‌లం చేస్తోంది. దశకు దశకు మధ్య రూపాంతరం చెందుతున్న ఈ వైరస్.. ప్రపంచ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేస్తోంది.

కరోనా వేరియంట్ ప్రజలను తొలి దశలోనే పట్టి పీడించగా, రెండో దశలో డెల్టా వేరియంట్ మరింతలా విరుచుకుపడింది. దీని బారిన పడిన రోగులకు జీవవాయువు అత్యంత అవసరమయ్యేలా చేసింది. సకాలంలో అందరికి కవాల్సినంత జీవవాయువు లేక అనేకానేక మంది రోగులు మృత్యువాతపడ్డారు. అతతలాకుతలం చేసింది. ఇక తాజాగా ఒమిక్రాన్ తో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అత్యంత వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ దాని లక్షణాలు మాత్రం పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నెమ్మదిగా హృదయ సంబంధ సమస్యలతో పోరాడుతున్నవారిని టార్గెట్ చేసుకుంటోందని తాజా అద్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ విధించారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్‌గా పిలువబడే షెన్‌జెన్‌లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు తెలిపారు.

హంకాంగ్‌ సరిహద్దు ప్రాంతంలోని షెన్‌జెన్‌ నగరంలో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్‌ సెంట్‌ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌ చున్‌లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్‌ డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles