DMK MP Elango’s son killed in road accident రోడ్డు ప్రమాదంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడి కొడుకు దుర్మరణం

Dmk rajya sabha mp nr elangovan s son killed in road accident

DMK, Elangovan, DMK MP Elangovan, Elangovan son death, DMK MP son accident, DMK MP son car crash, Elangovan son car crash, Rakesh Ranganathan dead in road accident, Chennai Road Accident, Chennai crime news, Chennai, DMK news, Tamil Nadu, Puducherry

Rajya Sabha MP and advocate N R Elango’s son Rakesh Ranganathan (21) died in a road accident in Villupuram district while he was on his way to Puducherry with a friend in the early hours of Thursday, the police said. According to Villupuram police, the vehicle bearing the registration number TN-02-CC-1000 rammed into the divider at Keezhputhupattu village on the East Coast Road, near Kottakuppam at the district’s border.

రోడ్డు ప్రమాదంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడి కొడుకు దుర్మరణం

Posted: 03/10/2022 02:55 PM IST
Dmk rajya sabha mp nr elangovan s son killed in road accident

తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజకం) పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు రాకేష్ రంగనాథన్ ‌(22) మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం.. డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు రాకేష్‌ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్‌ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా.. అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. మాజీ సీనియర్‌ న్యాయవాది ఇళంగోవన్‌ 2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్‌ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్‌ సహా, పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  MP  DMK  Elangovan  Rakesh Ranganathan  Puducherry  road accident  Chennai  Tamil Nadu  Puducherry  

Other Articles