Realtor shot dead in Hyderabad, land dispute suspected రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి

Unidentified persons fire at hyderabad based realtors one dead

Realtor shot dead in Ibrahimpatnam, gun shots on realtor car, gun firing on realtors in karnaguda, land dispute settelment, land dispute, dispute between realtor partners, suspected, Settlement, MattaReddy, Srinivas Reddy, Raghavender Reddy, Ibrahimpatnam, Rangareddy, Telangana, Crime

Unidentified assailants opened fire at two real estate businessmen here at Ibrahimpatnam of Rangareddy district. The realtor, Srinivas Reddy who sustained the bullet injuries was dead on the spot while another identified as Raghavendra Reddy was injured and died while undergoing treatment at hospital.

రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి

Posted: 03/01/2022 12:26 PM IST
Unidentified persons fire at hyderabad based realtors one dead

తెలుగు రాష్ట్రాల్లో భూలక్ష్మీ.. ధనలక్ష్మి అవతారం ఎత్తి ఏళ్లైంది. దీంతో కాస్తో కూస్తో కాసులున్న వారి నుంచి బడాబాబుల వరకు అందరూ రియల్ ఎస్టేట్ రంగంపైనే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య వైరమో లేక భూమి యజమానుల నుంచి సమస్య తీవ్రమైందో తెలియదు కానీ.. ఓ రియల్టర్ కారుపై అగంతకులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప‌ట్నం సమీపంలోని కర్ణంగూడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘటనాస్థలంలోనే మరణించాగా, మరోక వ్యాపారి రాఘవేందర్ రెడ్డి తీవ్రగాయాలపాలైయ్యాడు.

మంగ‌ళ‌వారం ఉద‌యం చ‌ర్లప‌టేల్‌గూడ‌-క‌ర్ణంగూడ మ‌ధ్యలో కారులో ఉన్న రియల్టర్లు రఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలపై దుండ‌గులు ఒక్కసారిగా కాల్పుల వర్షం కురిపించారు. వారి కారు రన్నింగ్లో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కారులో ఒకరు చనిపోయి ఉండటం, మరోకరు సృహకోల్పోయి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గాయపడిన రఘవేందర్ రెడ్డిని చికిత్స నిమిత్తం బిఎన్ రెడ్డినగర్ సమీపంలోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సదరు రియల్టర్ అంబర్ పేట్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా మరణించిన శ్రీనివాస్ రెడ్డిది అల్మాస్ గూడ అని పోలీసులు నిర్ధారించారు.

రఘుకు సైతం శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, సెటిల్మెంట్‌కి పిలిచి కాల్పులు జరిపినట్లు సమాచారం. పటేల్ గూడలో వేసిన 22 ఎకరాల వెంచర్ పై గొడవ వల్లే కాల్పులు చోటుచేసుకున్నాయని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మట్టారెడ్డి అనే వ్యక్తితో కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి వెంచర్ వేశారని, దానిపై కొన్ని నెలలుగా గొడవ జరుగుతోందని చెబుతున్నారు. దాని గురించి సెటిల్మెంట్ చేసుకుందామని మట్టారెడ్డి పిలిచాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే బయల్దేరిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై అతడే కాల్పులకు దిగి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మట్టారెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles