No imprisonment, only fine for drunk drivers డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో దొరికిన మందుబాబులకు ఊరట

No imprisonment fine wavior in drunk and driver pending challans

Hyderabad Traffic Police, discount on traffic challans, motorists, Two Wheelers, Four Wheelers, heavy vehicles, RTC buses, Drunk and drive cases, No Imprisonment, Lok Adalat, telangana e-challan, traffic police, Telangana, Crime

In the view of the long pending drunk and drive cases, the city police department is taking steps to fine the motorists who were caught in drunk driving for the first time. The police department has taken the decision to resolve the pending drunk and drive cases in the mega Lok Adalat on March 12.

వాహనదారుల తరువాత మందుబాబులకు ఊరట.. జరిమానాల్లో రాయితీ..

Posted: 03/01/2022 01:18 PM IST
No imprisonment fine wavior in drunk and driver pending challans

ట్రాఫిక్ పోలీసులు ఒకరి తరువాత ఒకరికి భారీగా సంక్రాంతి పండగ రాయితీలు కల్పిస్తున్నారు. ఇవాళ్టి నుంచి పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో భారీ రాయితీ కల్పించడంతో ఇప్పటికే వాహనదారులు పోటీ పడి మరీ తమ వాహనాల పెండింగ్ చలాన్లను ఒక్క దెబ్బకు క్లియర్ చేసుకుంటున్నారు. ఇక వారికి మాత్రం ఆకుల్లో వడ్డిస్తూ.. మాకు మాత్రం కంచాల్లోనా.? అన్నట్లు మందుబాబులు అడిగారో ఏమో తెలియదు కానీ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కూడా తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు బోల్డంత ఉపశమనం కల్పించారు. తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి విధించిన జరిమానాల్లో భారీ రాయితీలు ప్రకటించారు.

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వారికి ఇప్పటి వరకు జైలు శిక్షలు విధిస్తుండగా ఇకపై జరిమానాలతోనే సరిపెట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక లోక్ అదాలత్‌ల ద్వారా పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు అన్ని కమిషనరేట్ల పరిధిలోని న్యాయస్థానాల్లోనూ మార్చి 12 వరకు లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. నిజానికి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి వాహనాలు వదిలేసుకున్న చాలామంది జైలు శిక్షపడుతుందేమోనన్న ఉద్దేశంతో పోలీసులను, కోర్టులను సంప్రదించడం మానేశారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారు రూ. 10 వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి రావడంతో పాత వాహనాలను వదిలేసుకోవడమే మేలని భావించి అటువైపు చూడడం మానేశారు. అలాంటి వారికిది శుభవార్తే.

జైలు శిక్ష లేకుండా చేయడంతోపాటు జరిమానాలను కూడా తగ్గించడంతో అలాంటి వారంతా ముందుకొస్తారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. రాయితీల విషయంలో బైక్‌లు, కార్లు, హెవీ వెయిట్ వాహనాలకు వేర్వేరుగా జరిమానాలు విధించగా, రాయితీలు కూడా అందుకు అనుగుణంగానే ప్రకటించారు. అయితే, రాయితీ చెల్లించిన తర్వాత కూడా మరోమారు పట్టుబడితే మాత్రం జరిమానాను రెండింతలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయితీలతో కూడిన లోక్ అదాలత్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ నెల 12న ముగుస్తుందని, ఆలోగా పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత మాత్రం పాత జరిమానాలే కొనసాగుతాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles