TMC poster stirs up a Political storm in Bengal దుర్గాదేవిగా మమత, మహిషాసురుడిగా ప్రధాని..

Mamata banerjee as durga pm modi as mahishasur tmc poster stirs up a storm

Mamata Banerjee as Durga, PM Modi as Mahishasur, TMC poster stirs up a storm, Congress CPM as Goats, muncipal election campaign in Bengal, Mamata Banerjee, Durga, PM Modi, Mahishasur, TMC poster, political storm, Congress, CPM, muncipal elections, West Bengal, Politics

A poster showing West Bengal Chief Minister Mamata Banerjee as 'Durga' and Prime Minister Narendra Modi as 'Mahishasur' stirred up a controversy in the state. Calling it an insult to the prime minister and Santan Dharma, a BJP leader said the party will approach the Election Commission over the matter.

బెంగాల్ పోస్టర్ కలకలం.. దుర్గాదేవిగా మమత, మహిషాసురుడిగా ప్రధాని..

Posted: 02/18/2022 07:07 PM IST
Mamata banerjee as durga pm modi as mahishasur tmc poster stirs up a storm

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చతికిల పడ్డ బీజేపి.. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందన్న ధీమాతో తృణముల్ తో ధీటుగా, ధాటిగానే ఢీకొంటోంది. అయితే తృణముల్ మాత్రం తనకు ఎదురులేదన్న ఎన్నికల్లో నిరూపితం అవుతున్న నేపథ్యంలో ధాటిగానే బదులిస్తోంది. దీంతో రాష్ట్రంలోని ఏ స్థాయి ఎన్నికలు వచ్చినా.. ఈ రెండు పార్టీల నేతల మధ్య భౌతిక దాడులు సైతం చోటుచేసుకున్నాయి. తాజాగా మరో వివాదం బెంగాల్‌లో తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య హోరాహోరీగా ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారం హోరులో బెంగాల్ జిల్లాలోని మిడ్నాపూర్‌లో ఓ పోస్టర్‌ కలకలం సృష్టించింది. మిడ్నాపూర్ లోని మదనాపూర్ జిల్లాలో అవిష్కృతమైన ఓ పోస్టర్ లో ప్రధాని నరేంద్ర మోదీని 'మహిషాసురుడు'గా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని 'దుర్గ'గా చూపిస్తూ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు స్థానిక తృణముల్ కాంగ్రెస్ నేతలు. ఈ పోస్టర్లో గొర్రెలుగా కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలను పోల్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ పోస్టర్‌పై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక‍్తం చేస్తున్నారు.

ఎవరైనా మేకలకు ఓటేస్తే.. వారిని బలిస్తామంటూ కింద నోట్ కూడా పెట్టారు. దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో 108 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టర్‌ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని స్థానిక కమలం నేత విపుల్ ఆచార్య తెలిపారు. కాగా, ఈ పోస్టర్‌ను ఎవరు అంటించారో తనకు తెలియదంటూ స్థానిక వార్డ్‌ మెంబర్‌ అనిమా సాహా(టీఎంసీ) వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles