Sunny Leone’s PAN Card Used To Take Loan సన్నీ లియోన్‌ మోసపోయింది.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Sunny leone tweets about her pan card being used for loan fraud deletes later

sunny leone, sunny leone controversy, sunny leone fraud, sunny leone pan card fraud, loan fraud, sunny leone loan fraud, sunny leone IVLSecurities, sunny leone dhani finance,sunny leone india bulls, sunny leone finance fraud, sunny leone cyber crime, sunny leone cibil score

In a now-deleted tweet posted from her account, actor Sunny Leone alleged that somebody had used her PAN card to take out a loan. The actor later tweeted an update that the matter has been resolved. It seems Sunny Leone fell victim to a loan fraud recently. On Thursday, the actor tweeted how her CIBIL score had been affected after someone fraudulently used her PAN Card to take out a loan.

మోసపోయిన సన్నీ లియోన్‌.. అమె పేరుతో అజ్ఞాత వ్యక్తి రుణం.. ఆ తర్వాత

Posted: 02/18/2022 05:36 PM IST
Sunny leone tweets about her pan card being used for loan fraud deletes later

తన పాన్‌ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ ఆరోపించింది. తన పాన్‌ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారంటూ ఆమె సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది. ఈ మేరకు సన్నీ లియోన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో 2 వేల రూపాయల రుణం తీసుకుని నా సీబీల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్, గతంలో ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.  

అనంతరం కొద్ది సేపటి తర్వాత సన్నీ లియోన్‌ ఈ ట్వీట్‌ను డిలిట్‌ చేసి మరో ట్వీట్‌ ఐవీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్‌కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నాను. ఎందుకంటే చెత్త సీబీల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరు’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఇలాంటి మోసాలకు నిత్యం వందల మంది బాధ్యులు అవుతుంటారు. ఆ తర్వాత అవి పరిష్కారమవుతుంటాయి. కానీ సన్నీ లియోన్‌ తొందరపడి ఐవీఎల్‌ సెక్యూరిటీని విమర్శించడం, ఆ తర్వాత ట్వీట్‌ డిలిట్‌ చేయడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles