TPCC chief Revanth Reddy arrested for the second day రెండవ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్.. గోల్కొండ పీఎస్ కు తరలింపు

Hyderabad police arrest tpcc chief revanth reddy over remarks against cm

Revanth Reddy arrested second day, Revanth Reddy on KCR birthday, Revanth Reddy Golkonda police station, Revanth Reddy Twitter post viral, TPCC President, Komatireddy Venkat Reddy, Bhongir MP, Congress senior leader, Congress, Rival Political Parties, Nalgonda, telangana, Politics

The police arrested Telangana Pradesh Congress Committee chief A Revanth Reddy, following his statements made against Chief Minister K Chandrasekhar Rao. Deriding his birthday celebrations, the leader had given a call for party to organise a series of events mocking the occasion.

రేవంత్ రెడ్డి అరెస్ట్.. గోల్కొండ పీఎస్ కు తరలింపు.. ముఖ్యనేతల గృహనిర్భంధం

Posted: 02/17/2022 11:56 AM IST
Hyderabad police arrest tpcc chief revanth reddy over remarks against cm

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇవాళ హైదరాబాద్​లో పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఆయనను గృహనిర్భంధంలో ఉంచిన పోలీసులు ఇవాళ ఏకంగా ఆయనను అరెస్టు చేసి గోల్కొండ పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఆయన తన జూబ్లీహిల్స్​లోని నివాసం నుంచి బయలుదేరుతుండగా వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టును వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. అరెస్టుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున పోలిస్ జులుం నశించాలని నినదించారు.

ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. కాగా నినాదాలు, తోపులాటల మధ్యే పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు గత ఏడేళ్ల కాలంలో చేసిన ద్రోహం.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా వారిని నమ్మించి మోసం చేసిన తీరుకు నిరసనగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ నిరుద్యోగ దినోత్సవాన్ని జరుపుకుంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ప్రతీ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు గాడిదలకు సన్మానించాలని కూడా ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున దారుణమైన చర్యలకు కాంగ్రెస్ శ్రేణులు పూనుకోకుండా.. హైదరాబాద్ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకన్నారు. నిరుద్యోగ సమస్యపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి చూసేలా.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్​కు రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన తాజా ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంజన్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. షబ్బీర్ అలీ సహా ముఖ్యనాయకులను గృహనిర్బంధం చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రాణార్పణలు చేసుకుంటుంటే.. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి మూడు రోజుల జన్మదిన సంబరాలు అవసరమా.? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల కర్మ దినంగా మారిందని వాపోయారు. కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలి పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అని అన్నారు.

నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్‌తో అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేయాలని చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్టును పలువురు పీసీసీ నేతలు ఖండించారు. రేవంత్ అరెస్టు అక్రమం అని, అప్రజాస్వామికమని మహేశ్ కుమార్, మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధ కాండ అమలవుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని వాపోయారు. కాగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి మొదట లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌ వైపు తీసుకెళ్లిన పోలీసులు అక్కణ్నుంచి గోల్కొండ పీఎస్‌కు తరలించారు. గోల్కొండ పీఏస్ వెళ్లే దారులన్నీ మూసేశారు. పీఏస్‌కు కిలోమీటర్ దూరం నుంచి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles