SBI hikes interest rates of long-term FDs ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. మరీ ముఖ్యంగా..

Sbi hikes interest rates on some fixed deposit tenures

SBI, state bank of india, fixed deposits, interest rates, SBI fixed deposits, SBI fixed deposit interest rates, SBI FD interest rates, Fixed deposits, FDs, SBI FD, Business, Economy, Finance

The State Bank of India (SBI) has increased interest rates on fixed deposits (FDs) for tenures above 2 years by 10-15 basis points with effect from February 15, 2022. According to the SBI website, for the FD tenure of 2 year to less than 3 years, interest rate has been increased by 10 basis points to 5.20 percent, for 3 year to less than 5 year it has been hiked by 15 basis points to 5.45 percent.

ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. మరీ ముఖ్యంగా..

Posted: 02/16/2022 09:00 PM IST
Sbi hikes interest rates on some fixed deposit tenures

దేశంలోని అతిపెద్ద జాతీయ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్న ఖాతాదారులతో మరీ ముఖ్యంగా ఈ గుడ్ న్యూస్ ను పంచుకుంది. ఇన్నాళ్లు ఇస్తున్న వడ్డీ రేట్లనుపెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతో బ్యాంక్ నిర్ణ‌యంపై ఫిక్స్‌డ్ డిపాజిట‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా ..కొత్త‌గా పెరిగిన వ‌డ్డీ రేట్లు నేటి నుంచి అమ‌ల్లోకి  వ‌చ్చాయి. కాగా రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ఎస్బీఐ వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం..భారతీయ స్టేట్ బ్యాంకు ఇప్పుడు 2 ఏళ్లకు మించిన కాలపరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

*2 సంవత్సరాల నుండి 3సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్‌డ్రేట్ల కాల‌ప‌రిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 15 బేసిస్ పాయింట్లు  పెరిగి 5.45 శాతానికి చేరింది.   

* 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీల కాల‌ప‌రిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరుకుంది.

* 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు మారవు. ఎస్‌బీఐ జనవరి 2022లో 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న ఎఫ్‌డీల‌ వడ్డీ రేటును రూ. 2 కోట్లలోపు 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచిందని గమనించాలి. ఈ ఎఫ్‌డీలు ఇప్పుడు 5.1 శాతం (5% నుండి పెరిగాయి) సీనియర్ సిటిజన్‌లు 5.6% (5.5% నుండి) వ‌డ్డీని పొంద‌వ‌చ్చు.

* డిసెంబర్ 2021లో ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం..బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బీపీఎస్‌కి పెంచింది. కొత్త బేస్ రేటు, అంటే సంవత్సరానికి 7.55శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో మరియు రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles