Rowdy gang hulchul at a hotel in nizamabad రౌడీమూకల వీరంగం.. కిందపడేసి కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ.

Rowdy sheeter ibbu and his gang attacked on hotel in nizamabad

nizamabad rowdy sheeters, rowdy sheeters attack a man, nizamabad rowdy sheeter, nizamabad rowdy sheeter arif, nizamabad rowdy sheeter news, rowdy sheeters attack young man, nizamabad rowdy sheeter names, nizamabad rowdy sheeter hulchul, Nizamabad, rowdy sheeters, Hotel, Attack, Hotel furniture, Gangster Ibbu, Arif, Nizamabad, Nizamabad police, Telangana, Crime

Telangana Rowdy Sheeter Ibbu And His Gang Members Attacked On Hotel In Nizamabad, Ibbu and his gang member destroyed the hotel by pedaling stones on to the furniture and kitchen of the Hotel.

ITEMVIDEOS: రౌడీమూకల వీరంగం.. కిందపడేసి కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ..

Posted: 02/16/2022 06:00 PM IST
Rowdy sheeter ibbu and his gang attacked on hotel in nizamabad

నిజామాబాద్‌ జిల్లాలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్‌లోని రజాక్‌ టీ స్టాల్‌పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్‌, అనుచరులు దాడులకు తెగబడ్డారు. హోటల్‌లో టీ తాగుతుండగా వివాదం తలెత్తడంతో రౌడీషీటర్, పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ హిబ్బుతో పాటు అతని అనుచరులు మూకుమ్మడిగా హోటల్ నిర్వాకులపై దాడి చేశారు. హోటల్ లోని సామాద్రిని ధ్వంసం చేసేలా రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా అయిదుగురు రౌడీలు రజాక్ హోటల్‌పై ఇనుప రాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్‌లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

హోటల్ నిర్వాహకుడిని కిందపడేసి ఒకడు అతనిపై కూర్చోని దాడి చేస్తుండగా, మరో ముగ్గురు మూడు వైపుల నుంచి పెద్ద కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో రౌడీ షీటర్ జంగిల్ హిబ్బు సహా ఐదుగురి పై కేసు నమోదు చేశారు. రౌడీ మూకల వీరంగంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధఃగా రౌడీషీటర్ల దాడిలో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీ స్టాల్‌లోని వ్యక్తిని రోడ్డుపైకి లాక్కొచ్చి కిరాతకంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాత కక్షల నేపథ్యంలో దాడి ఘటన  జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rowdy sheeters  Hotel  Attack  Hotel furniture  Gangster Ibbu  Arif  Nizamabad  Nizamabad police  Telangana  Crime  

Other Articles