Why such haste in replacing Sawang: Pawan Kalyan అకస్మాత్తుగా రాష్ట్ర డీజీపిని తప్పించడానికి కారణాలేంటీ: పవన్ కల్యాణ్

Why such haste in replacing sawang pawan kalyan questions ap govt

Director General of Police, Gautam Sawang, Jana Sena Party, Pawan Kalyan, Jagan Mohan Reddy government, Vijayawada, JSP, employees’ agitation, PRC agitation, L.V. Subramanyam, Andhra Pradesh, Politics

Jana Sena Party president Pawan Kalyan demanded that the government specify the reason for the abrupt replacement of Director-General of Police (DGP) D. Gautam Sawang with another officer. The JSP chief said the government might have the administrative power to appoint officers, but where was the need to replace Mr. Sawang in such haste.

అకస్మాత్తుగా రాష్ట్ర డీజీపిని తప్పించడానికి కారణాలేంటీ: పవన్ కల్యాణ్

Posted: 02/16/2022 05:09 PM IST
Why such haste in replacing sawang pawan kalyan questions ap govt

రాష్ట్ర పోలీస్ బాస్ పోస్టు నుంచి అంత అకస్మాత్తుగా గౌతమ్‌ సవాంగ్ ను తప్పించడం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. గౌతమ్‌ సవాంగ్ బదిలీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వేతన సవరణ ఒప్పందాల (పీఆర్సీ) జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు విజయవాడకు పెద్దఎత్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగులు హాజరుకావడమే ఆయన బదిలీకి కారణమా.? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. కారణాలు ఏంటో ప్రభుత్వం తెలుపకుండానే గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించింది.

కాగా సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అగ్గికి ఆజ్యం తోడైనట్లు మరింత చర్చకు దారితీసింది. దీంతో రాజకీయ నేతలు కూడా సవాంగ్‌ను మార్చడంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీపీఐ జాతీయ నేత నారాయణ గౌతమ్ సవాండ్ డీజీపీగా తప్పించడంపై ఆయనకు తగిన శాస్తి జరిగిందని పెదవి విరిచారు. కాగా గౌతమ్ సవాంగ్‌ను అంత అకస్మాత్తుగా తప్పించాల్సిన అవసరం ఏంటని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఉన్న పళంగా బాధ్యతల నుంచి తప్పించడం విస్మయం కలిగించిందని పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

అధికారులను నియమించుకోవడం ప్రభుత్వానికున్న పాలనాపరమైన అధికారమని, అయితే, ఇదే సమయంలో డీజీపీని ఇంత హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాఉండగా, గౌతమ్ సవాంగ్‌కి తగిన శాస్తే జరిగిందని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. ఉన్నత స్థాయి అధికారులు పాలక వర్గం ఏం చెప్తే అది చేయాలని భావిస్తే ఫలితం ఇలాగే ఉంటుందన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ వంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని చెప్పారు. తప్పులు చేసి విధేయత చూపించడం అధికారులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles