Elephant Intense Fight With JCB Machine జేసీబి డ్రైవరుపై కేసుకు పెరుగుతున్న డిమాండ్.!

Viral video elephant and jcb machine engage in an intense fight

Viral Video, Elephant, Elephant Video, Elephant vs crane, Elephant vs JCB, Elephant vs heavy-duty excavator, funny video, google trends, trending video, omg video, hathi ka video, video viral

While elephants are cute, loving and faithful animals, they can also be dangerous and territorial when they need to protect themselves. A video is going viral on social media where a wild elephant can be seen fighting a JCB machine. The video was uploaded on Instagram by Wild_animals_creation’ a day ago and has so far received over 1,100 likes.

ITEMVIDEOS: జేసీబితో గజరాజు పోరు.. డ్రైవరుపై కేసుకు పెరుగుతున్న డిమాండ్.!

Posted: 02/07/2022 06:27 PM IST
Viral video elephant and jcb machine engage in an intense fight

సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అడవులలో పెద్దదైన వన్యప్రాణి గజరాజే. ఇక ఎంత పెద్దదైనా ఏనుగు మాత్రం కేవలం దుంపలు మొదలగు సాత్వికాహారాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయి. అయితే ముచ్చట గొలుపుతూ మనుషులతో మమేకమవుతుంటాయి. అలాంటి ప్రశాంత జీవి అయిన ఏనుగులకు ఆగ్రహం వస్తే భరించడం మాత్రం చాలా కష్టం. వాటి కోపం రాదు.. వచ్చిందా.. అంత సులభంగా తగ్గదు. ఈలోగా గజరాజు కోపానికి జరగరాని ఘటనలు జరిగిపోతాయి. తమకు నిత్యం తోడుగా వుండే మావటి మాటలను కూడా అవి వినవు.

ఏనుగులు ఆగ్రహంతో ఉన్నప్పుడు వాటిని నియంత్రించడం మనుషులకే కాదు యంత్రాలకూ సాధ్యం కాదు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది ఈ ఘటన. తవ్వకాలు జరిపే జేసీబీ, ఏనుగు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నది. ‘వైల్డ్ యానిమల్స్ క్రియేషన్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చిన ఒక ఏనుగును జేసీబీతో తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దీంతో తొలుత అక్కడి నుంచి వెళ్లేందుకు కొంత ముందుకు వెళ్లింది ఏనుగు.

ఆ తరువాత ఏమనుకుందో ఏమో కానీ తగ్గేదేలే అని భావించింది. పరుగున వెనక్కి వచ్చి జేసీబీతో తలపడింది. తన తొండంతో దానిని ముందుకు తోస్తుంది. జేసీబీకి ముందు ఉన్న తవ్వే పరికరంతో గాయపడే ప్రమాదమున్నప్పటికీ ఆ ఏనుగు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఏనుగు తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చాలా మంది సమర్థించారు. ఆ వ్యక్తి జేసీబీతో ఏనుగుపై దాడి చేయడాన్ని తప్పుపట్టారు. అదృష్టం బాగుండి ఏనుగుకు ఏమీ కాలేదు. లేదంటే వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద జేసీబి డ్రైవరుపై కేసు నమోదు చేయాల్సి వచ్చేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles