Weather bad for BJP: Jayant Chaudhary swipe బిజ్నోర్ లో బీజేపి పరిస్థితే ఏం బాగోలేదు: జయంత్ చురకలు

After pm modi cancels bijnor rally jayant chaudhary takes a swipe

Jayant Chaudhary, PM Modi Rally, Bijnor, BJP's weather is bad, Samajwadi Party, Akhilesh yadav, Yogi Adityanath, garmi, Army recruitment, BJP, UP Polls, uttar pradesh assembly elections, Twitter, Rashtriya Lok Dal chief Jayant Chaudhary, unparliamentary language, Uttar Pradesh, Politics

Prime Minister Narendra Modi had to cancel his rally in Bijnor, in poll-bound Uttar Pradesh due to bad weather, on Monday but Rashtriya Lok Dal (RLD) chief Jayant Chaudhary claimed he did it as the Bharatiya Janata Party (BJP) is facing difficulty in the state. Chaudhary, whose party is in alliance with Akhilesh Yadav-led Samajwadi Party (SP), has been attacking the BJP, alleging that the party will face trouble in western Uttar Pradesh.

ప్రధాని మోడీ బిజ్నోర్ ర్యాలీ రద్దుపై ఆర్ఎల్డీ నేత జయంత్ తాజా పంచ్.!

Posted: 02/07/2022 05:30 PM IST
After pm modi cancels bijnor rally jayant chaudhary takes a swipe

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలో తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. అవకాశం లభిస్తే చాలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ మధ్య కేంద్రహోం మంత్రి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల వరకే సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల మధ్య పోత్తు ఆ తరువాత ఎవరికి వారే అని విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. దానికి ఎస్సీ, ఆర్ఎల్డీ పార్టీల నేతలు కూడా కౌంటరిచ్చారు. తాజాగా బిజ్నోర్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నిర్వ‌హించాల్సిన ర్యాలీ ర‌ద్దు కావ‌డం ప‌ట్ల రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ చీఫ్ జ‌యంత్ చౌధ‌రి స్పందించారు. యూపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంద‌ని ఎద్దేవా చేశారు.

బిజ్నోర్‌లో ప్ర‌ధాని స్వ‌యంగా ర్యాలీలో పాల్గొని ప్ర‌సంగించాల్సి ఉండ‌గా వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో ర‌ద్దు చేసుకున్నారు. ఆపై ర్యాలీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజ‌ర‌య్యారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో ప్ర‌ధాని హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ కాలేక‌పోతోంద‌ని తాను కూడా స‌భా వేదిక‌కు ఆల‌స్యంగా చేరుకున్నాన‌ని యోగి వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే బిజ్నోర్‌లో వాతావ‌ర‌ణ ప‌రిస్ధితులు బాగానే ఉన్నాయ‌ని జయంత్ చౌధ‌రి ట్వీట్ చేశారు. బిజ్నోర్‌లో సూర్యుడు ప్ర‌కాశిస్తున్నాడ‌ని.. బీజేపీ ప‌రిస్ధితే బాగా లేద‌ని చుర‌కలు వేశారు. బిజ్నోర్ ర్యాలీలో 1000 మంది కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఇక వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌ధాని మోదీ బిజ్నోర్‌, మొర‌దాబాద్‌, అమ్రోహ జిల్లాలకు చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. 18 నియోజ‌క‌వర్గాల ప‌రిధిలోని కార్య‌క‌ర్త‌ల‌తో మోదీ ముచ్చ‌టించారు.

ఇక యూపీలో మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోవాల‌ని యోగి ఆదిత్యానాధ్ సార‌ధ్యంలోని బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుండ‌గా, యోగి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకుని అంద‌లం ఎక్కాల‌ని అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని ఎస్పీ చెమ‌టోడుస్తోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ పావులు క‌దుపుతుండ‌గా, ద‌ళితులు, అణ‌గారిన వర్గాల వెన్నుద‌న్నుతో ప్ర‌ధాన పార్టీల‌కు దీటైన పోటీ ఇచ్చేందుకు మాయావ‌తి సార‌ధ్యంలోని బీఎస్పీ క‌స‌ర‌త్తు సాగిస్తోంది. యూపీలో ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి ఏడు వ‌ర‌కూ ఏడు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles